Vice President Election: నేడు ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం జరిగింది. ఉపరాష్ట్రపతి పదవికి ఉమ్మడి వ్యూహంపై సమావేశంలో చర్చించారు. మీటింగ్ అనంతరం.. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎన్నికల సంఘం (ECI) ఉపరాష్ట్రపతి ఎన్నికల తేదీలను ప్రకటించిందని, నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ ఆగస్టు 21 అని ఆయన తెలియజేశారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రధానమంత్రి మోడీ, జేపీ నడ్డా నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. ఈ…
జగదీప్ ధన్కడ్ రాజీనామాతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి పదవి కోసం త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. అందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. ఈ అంశంపై తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జగదీప్ ధన్కడ్ రాజీనామా బాధాకరమన్నారు.