రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా.. వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందిన ‘విరాటపర్వం’ చిత్రం.. ఎట్టకేలకు జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రాబోతోంది. సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మించారు. రీసెంట్‌గా రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. అయితే ఎప్పుడో థియేటర్లోకి రావాల్సిన ఈ సినిమా.. ఎన్నో వాయిదాల అనంతరం సోలోగా వచ్చేందుకు సిద్దమైంది. ముందుగా జులై 1న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ…
ఒక డైరెక్టర్.. ఎంతో ఇష్టపడి కథను రాసుకొని, కష్టపడి ఆ కథను ఒక సినిమాగా మలిచి.. ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఎంతో శ్రమిస్తాడు. సినిమా మొదలైనప్పటి నుంచి చివరి వరకు తన సొంత బిడ్డను చూసుకున్నట్లు చూసుకుంటారు. ఆ సినిమా కు ఏదైనా డ్యామేజ్ జరిగినా, సినిమా ప్రేక్షకులకు నచ్చకపోయినా ఎంతో మానసిక వేదనకు గురవుతారు.. తాజాగా ఇదే పరిస్థితిని తాను ఎదుర్కొన్నాను అని చెప్పుకొచ్చాడు దర్శకుడు వేణు ఉడుగుల. నీది నాది ఒకే కథ చిత్రంతో…
ఎప్పుడో విడుదల అవ్వాల్సిన ‘విరాటపర్వం’ సినిమా.. వాయిదాల మీద వాయిదా పడుతూ ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత రిలీజ్‌కి ముస్తాబవుతోంది. జూన్ 17వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం అనూహ్యమైన రీతిలో ప్రమోషన్ కార్యక్రమాల్ని చేపట్టారు. జూన్ 5వ తేదీన ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ అనౌన్స్‌మెంట్‌కు కూడా చాలా డిఫరెంట్‌గా ఓ వీడియో రూపంలో ఇచ్చారు. ఈ వీడియోలో ఓ అభిమాని (30 వెడ్స్ 21 ఫేమ్ కార్తీక్)…
రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విరాటపర్వం’. దగ్గుబాటి సురేష్ బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు జూన్ 17 న విడుదల కానున్న విషయం విదితమే. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మరో సాంగ్ రిలీజ్ కు ఏంకర్స్…
దగ్గుబాటి రానా అభిమానులకు రెండు శుభవార్తలను అతని నిర్మాతలు మే 30న కలిగించారు. అందులో మొదటిది వెంకటేశ్, రానా కలిసి నటిస్తున్న వెబ్ సీరిస్ ‘రానా నాయుడు’ షూటింగ్ పూర్తయిపోయిందనే వార్త. అతి త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో ఈ వెబ్ సీరీస్ ఎప్పుడు స్ట్రీమింగ్ అయ్యేది తెలియచేస్తామని మేకర్స్ తెలిపారు. ఇక రెండోది ఎప్పటి నుండో ఇదిగో అదిగో అంటూ వస్తున్న ‘విరాట పర్వం’ విడుదల తేదీని ప్రీపోన్ చేయడం. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందనే…
చాలామంది కథానాయికలు ఎక్కువ కష్టపడటానికి ఇష్టపడరు. ఏదో వచ్చామా, గ్లామర్‌గా కనిపించామా, నాలుగు పాటల్లో డ్యాన్స్ చేశామా, వెళ్ళామా అన్నట్టుగా లాగించేస్తుంటారు. కానీ, కొందరు అలా ఉండరు. తాము చేసే ప్రతీ పాత్ర ఛాలెంజింగ్‌గా ఉండాలని కోరుకుంటారు. అందుకోసం, ఎంత కష్టపడడానికైనా వెనుకాడరు. అలాంటి వారిలో సాయి పల్లవి ఒకరు. నేచురల్ నటిగా తనదైన ముద్ర వేసిన ఈమె.. ఇప్పటిదాకా నటనకు ప్రాధాన్యమున్న ఛాలెంజింగ్ పాత్రల్లోనే నటించింది. ఇప్పుడు పని పట్ల తనకు ఎంత అంకితభావం ఉందో…
ఎన్ని సినిమాలు కరోనా సమయంలో వాయిదా పడ్డాయో అన్ని సినిమాలు విడుదల అయ్యి ప్రేక్షాదరణ పొందాయి. ఒక్క ‘విరాట పర్వం’ తప్ప.. రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి అప్పుడెప్పుడో ఒక రిలీజ్ డేట్ ని ప్రకటించారు.. వెంటనే లాక్ డౌన్ స్టార్ట్ అయ్యింది. లాక్ డౌన్ తర్వాత మరో రిలీజ్ డేట్ ప్రకటించారు.. మరోసరి లాక్ డౌన్.. ఇక ఆ తరువాత ఈ సినిమా గురించిన ఒక…