రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విరాటపర్వం’. దగ్గుబాటి సురేష్ బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు జూన్ 17 న విడుదల కానున్న విషయం విదితమే. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మరో సాంగ్ రిలీజ్ కు ఏంకర్స్ డేట్ ఫిక్స్ చేశారు. ‘నగాదరిలో’ అంటూ సాగే ఈ సాంగ్ ను జూన్ 2 న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన మేకర్స్ ఈ సాంగ్ ప్రోమోను తాజాగా విడుదల చేశారు.
“నిప్పు ఉంది.. నీరు ఉంది నగాదరిలో.. నెగ్గేది ఏది..? తగ్గేది ఏది..?నగాదరిలో” అంటూ సాగనున్నట్లు తెలిపారు. ఇక వీడియోలో రానా కోసం అన్ని వదిలి అడివికి వస్తుంది సాయి పల్లవి. అక్కడ ఆమెను చూసిన రానా మనసులోని భావాలను, ఆ జంటను ఒకరిని నిప్పుగా మరొకరిని నీరుగా పరిగణిస్తూ రాసిన లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇక ఈ చిత్రంలో రానా.. కామ్రేడ్ రవన్న గా కనిపిస్తుండగా.. అతనిని, అతని విప్లవాన్ని ఆరాధించే వెన్నెల గా సాయి పల్లవి కనిపిస్తుంది. సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ పాటను వరం అనే జానపద గాయని ఆలపించింది. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.