ఏపీ ప్రభుత్వంపై జరిగిన చర్చలపై ఉద్యోగులు హ్యాపీగా వున్నారన్నారు పీఆర్సీ సాధన సమితి నేత వెంకట్రామిరెడ్డి. ఫిట్ మెంట్ తప్ప మిగిలిన డిమాండ్లు మాకు సానుకూలంగా నే ప్రభుత్వం స్పందించింది. పదేళ్ల పీఆర్సీ బదులు ఐదేళ్ల పీఆర్సీని మేం సాధించుకున్నాం. హెచ్ ఆర్ ఎ శ్లాబుల్లో తెలంగాణతో సమానంగా సాధించుకున్నాం. మా నుంచి రూ.5400 కోట్లు రికవరీని ప్రభుత్వం ఆపేసింది. నిన్నటి చర్చల్లో ఏడాదికి 1500 కోట్లు అదనంగా ప్రభుత్వం నుంచి రాబట్టాం. సీఎంది చాలా పెద్ద…
ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల చర్చలు సఫలం అయ్యాయి. కాసేపట్లో సమ్మె విరమణ ప్రకటన చేయనుంది స్టీరింగ్ కమిటీ. ఈ మేరకు లిఖితపూర్వకంగా నోట్ రాసి ఇవ్వనున్నారు స్టీరింగ్ కమిటీ సభ్యులు. మీడియా సమక్షంలో స్టీరింగ్ కమిటీ సభ్యుల సంతకాలతో ప్రకటన రానుంది. సమ్మె నోటీసులో పేర్కొన్న అన్ని అంశాల పై ప్రభుత్వం నుంచి స్పందన వచ్చిందని పేర్కొననున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. హెచ్ ఆర్ ఏ విషయంలో ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య అవగాహన కలిగింది. 50,000 జనాభా..…
ఏపీలో పీఆర్సీపై రగడ జరుగుతున్న విషయం తెలిసిందే. నిన్న పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు ఉద్యోగులు చలో విజయవాడ కార్యక్రమానికి తరలివచ్చారు. దీంతో విజయవాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాకుండా చలో విజయవాడ కార్యక్రమానికి రాకుండా ఎక్కడి వారిని అక్కడే పోలీసులు నిర్బంధించారు. అయితే ఉద్యోగులు మారువేషాల్లో పోలీసుల కళ్ళు గప్పి విజయవాడకు చేరుకున్నారు. ఈ సందర్బంగా నేడు పీఆర్సీ సాధన సమితి నేత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ఛలో విజయవాడ విజయవంతమైందని ఆయన అన్నారు. ఉద్యోగులు…
చలో విజయవాడ లో భాగంగా సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట రామిరెడ్డి బైక్ పై విజయవాడ బయలుదేరారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం మొండి గా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. పే స్లిప్ లు చూస్తే గానీ సాలరీ పెరిగిందో తగ్గిందో తెలుసుకోలేని స్థితిలో ఉద్యోగులు లేరని, న్యాయబద్ధమైన హక్కు కోసం సమావేశం పెట్టుకుంటే ప్రభుత్వం ఎందుకు ఇన్ని ఆంక్షలు పెడుతోందని ఆయన అన్నారు. ఉద్యోగ సంఘాలకు అవసరమైన ఆందోళన చేసిన ఘటనలు చూశాం…
ప్రభుత్వ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే ఉద్యోగులకు పాత జీతాలే ఇవ్వాలని పీఆర్సీ సాధన సమితి నేత వెంకట్రామిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యమానికి సహకరిస్తున్న ట్రెజరీ ఉద్యోగులు, డీడీఓలపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తుందని వెంకట్రామిరెడ్డి అన్నారు. పాత జీతమే ఇవ్వాలని ప్రతి ఉద్యోగి డీడీఓలు.. హెచ్‌వోడీల వద్దకు వెళ్లి రాతపూర్వకంగా కోరాలన్నారు. దీని నిమిత్తం ఓ ప్రోఫార్మా రూపొందించామని తెలిపారు. చర్చలకు వచ్చే విషయంలో మా డిమాండ్లు ఏంటో…
ఏపీ జేఎసీ, ఏపీజేఎసీ అమరావతి, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం , సచివాలయ ఉద్యోగుల సంఘాలు ఏక తాటిపైకి రావాలని నిర్ణయించినట్టు బండి ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చర్చల ద్వారా సంప్రదింపులు చేసుకుని ఒకే తాటిపైకి రావాలని నిర్ణయించుకున్నామన్నారు. పీఆర్సీ జీవోల వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోల ద్వారా నష్టం జరుగుతుందన్నారు. ఐక్యంగా పోరాడి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి మా డిమాండ్లు సాధించుకుంటామన్నారు. సచివాలయంలో…
11వ పీఆర్సీపై ఏపీలో మళ్లీ ఉద్యోగ సంఘాలు సమ్మెకు సిద్ధమవుతున్నాయి. ఇటీవల సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన పీఆర్సీపై విముఖత ఉన్న ఉద్యోగ సంఘాలు.. తమ సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు చేపడుతామని ప్రకటించాయి. మరోమారు ప్రభుత్వంతో చర్చలు జరిపి తమ కార్యాచరణ ప్రకటిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. ఈ నేపథ్యంలో.. సీఎంఓ అధికారులతో చర్చలకు ఉద్యోగ సంఘాల నేతలు ప్రయత్నిస్తున్నారు. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ…
పీఆర్సీపై రెండు నెలలుగా చెప్పిందే సీఎస్ మళ్లీ చెబుతున్నారని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె. వెంకట్రామిరెడ్డి అన్నారు. ప్రభుత్వంతో చర్చల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎస్ వివరణలో కొత్త విషయాలేమీ లేవన్నారు. పీఆర్సీని, డీఏలను కలిపి చూడొద్దన్నారు. డీఏలను కూడా కలిపి జీతాలు పెరుగుతున్నాయని అధికారులు తప్పుడు లెక్కలు చూపెడుతున్నారని ఆయన మండిపడ్డారు. Read Also: తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు : మంత్రి ఆదిమూలపు ప్రభుత్వం ప్రటించిన 23 శాతం…