పీఆర్సీపై రెండు నెలలుగా చెప్పిందే సీఎస్ మళ్లీ చెబుతున్నారని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె. వెంకట్రామిరెడ్డి అన్నారు. ప్రభుత్వంతో చర్చల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎస్ వివరణలో కొత్త విషయాలేమీ లేవన్నారు. పీఆర్సీని, డీఏలను కలిపి చూడొద్దన్నారు. డీఏలను కూడా కలిపి జీతాలు పెరుగుతున్నాయని అధికారులు తప్పుడు లెక్కలు చూపెడుతున్నారని ఆయన మండిపడ్డారు.
Read Also: తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు : మంత్రి ఆదిమూలపు
ప్రభుత్వం ప్రటించిన 23 శాతం పీఆర్సీ వల్ల ఉద్యోగులకు నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. పీఆర్సీ జీవోలను ప్రభుత్వం వెనక్కు తీసుకోవాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. మిగిలిన సంఘాలతో కలిసి వెళ్లటానికి మేము సిద్ధమేనని ఆయన తెలిపారు. ఉమ్మడి వేదికగా కలిసి పోరాడేందుకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదని వెంకట్రామిరెడ్డి వెల్లడించారు.