విక్టరీ వెంకటేశ్, మీనా జంటగా ‘దృశ్యం2’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. జీతూ జోసెఫ్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి వెంకటేశ్ తన షూట్‌ను పూర్తి చేసుకున్నారు. కాగా ఈ సినిమా ఓటీటీలో విడుదల చేయనున్నారనే వార్త టాలీవుడ్‌లో ఎక్కువగా వినిపిస్తోంది. ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తున్నారట చిత్ర బృందం.కరోనా కారణంగా మలయాళ చిత్రం ‘దృశ్యం2’ను ఓటీటీలోనే…
విక్టరీ వెంకటేష్ టైటిల్ రోల్ లో రూపొందుతున్న పీరియాడికల్ డ్రామా ‘నారప్ప’. తమిళంలో భారీ హిట్ కొట్టిన ‘అసురన్’కు రీమేక్ గా తెరకెక్కుతోంది ‘నారప్ప’. తాజాగా సురేష్ బాబు ‘నారప్ప’లో కొన్ని మార్పులను సూచించాడట. ‘నారప్ప’ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలతో ఇటీవలే మాట్లాడిన సురేష్ బాబు ఫైనల్ కట్‌లో చేయాల్సిన మార్పులు, చేర్పులను సూచించారట. కొన్ని సన్నివేశాలను రీషూట్ చేయమన్నారట. ఇక ‘నారప్ప’కు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రియమణి కీలకపాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ…
బ్లాక్ బస్టర్ మలయాళ రీమేక్ ‘దృశ్యం’ చిత్రానికి సీక్వెల్ గా ‘దృశ్యం-2’ తెరకెక్కుతోంది. మొదటి పార్ట్ లో నటించిన నటీనటులే ఈ సీక్వెల్ లోనూ నటిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, హీరోయిన్ మీనా ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న ‘దృశ్యం-2’ నుంచి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం షూటింగ్ ను పూర్తి చేశారు వెంకటేష్. చిత్రంలో వెంకటేష్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్తి అయ్యింది. ఈ విషయాన్ని…
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎఫ్2 : ఫన్ అండ్ ఫ్రస్టేషన్’కి సీక్వెల్ గా ‘ఎఫ్3’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం కొత్త షెడ్యూల్ ను ఉగాది పండగ రోజున స్టార్ట్ చేశారు చిత్రబృందం. ఈ మేరకు సెట్స్ లోని పిక్స్ షేర్ చేస్తూ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు మేకర్స్. ‘ఈ ఇయర్ మొత్తం ఓన్లీ ఆనందం అండ్ ఫన్ ఉండాలి… నో శాడ్ నెస్ అండ్ టెన్షన్స్……