ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సీనియర్ హీరో నటించబోతున్నారన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల రూపొందించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ‘లవ్ స్టోరీ’ విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు శేఖర్ కమ్ముల తన తదుపరి ప్రాజెక్ట్ కు సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. శేఖర్ కమ్ముల తన నెక్స్ట్ ప్రాజెక్ట్ లో వెంకటేష్ నటిస్తే బాగుంటుందని అనుకుంటున్నారట. దీంతో వెంకటేష్ కు తగినట్టుగా స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకుని, త్వరలోనే ఆయన ను కలిసి కథను చెప్పనున్నారట శేఖర్ కమ్ముల. సాధారణంగా వెంకటేష్ న్యూ ఏజ్ సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తారు. కాబట్టి శేఖర్ కమ్ములకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. అంతా అనుకున్నట్టుగా జరిగితే వెంకటేష్, శేఖర్ కమ్ముల సినిమాపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన రావచ్చు. కాగా నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ‘లవ్ స్టోరీ’. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ చిత్రం విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాక ‘లవ్ స్టోరీ’ కొత్త విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఈ చిత్రం విడుదల కోసం చాలామంది ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.