బ్లాక్ బస్టర్ మలయాళ రీమేక్ ‘దృశ్యం’ చిత్రానికి సీక్వెల్ గా ‘దృశ్యం-2’ తెరకెక్కుతోంది. మొదటి పార్ట్ లో నటించిన నటీనటులే ఈ సీక్వెల్ లోనూ నటిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, హీరోయిన్ మీనా ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న ‘దృశ్యం-2’ నుంచి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం షూటింగ్ ను పూర్తి చేశారు వెంకటేష్. చిత్రంలో వెంకటేష్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్తి అయ్యింది. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ ఓ పిక్ ను విడుదల చేశారు. కాగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ గా మలయాళంలో తెరకెక్కిన ‘దృశ్యం’ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీంతో ఈ చిత్రాన్ని దర్శకుడు జీతూ జోసెఫ్ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో రూపొందించారు. అన్ని భాషల్లోనూ ఈ చిత్రానికి విశేష ఆదరణ లభించింది. ‘దృశ్యం, దృశ్యం-2’ మలయాళంలో మోహన్ లాల్ నటించగా తమిళంలో కమల్ హాసన్, హిందీలో అజయ్ దేవగన్ రీమేక్ చేశారు. ఇక తెలుగులో ‘దృశ్యం’ చిత్రానికి ప్రముఖ నటి శ్రీప్రియ దర్శకత్వం వహించారు. అయితే ‘దృశ్యం-2’ తెలుగు రీమేక్ కు మాత్రం దర్శకుడు జీతూ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ‘దృశ్యం-2’ ప్రేక్షకుల ముందుకు రానుంది.