దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయలో శివకల్యాణ మహోత్సవములు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో నేటి నుంచి 5 రోజుల పాటు శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో ఉత్సవాలు జరుగనున్నాయి. రేపు అభిజిత్ లగ్న ముహూర్తమున వేదమూర్తుల మంత్రోచ్ఛరణల మధ్య శ్రీ పార్వతీరాజరాజేశ్వర స్వామి వార్ల దివ్య కల్యాణోత్సవం కన్నుల పండువగా జరుగనుంది. స్వామి వారిని దర్శించుకునేందకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వేములవాడకు చేరుకుంటున్నారు. అయితే 23 తేదీన పట్టణ పుర…
దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడ పుణ్యక్షేత్రం భక్తులతో రద్దీగా మారింది. మేడారం సమ్మక్క-సారక్క జాతరను పురస్కరించుకొని భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క-సారక్క జాతరకు వెళ్లే భక్తులు ముందుగా వేములవాడలో శ్రీరాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీ. అంతేకాకుండా బద్దిపోచమ్మకు ఎంతో భక్తిశ్రద్దలతో, అంగరంగ వైభవంగా శివసత్తుల నృత్యాల నడుమ బోనాలు అమ్మవారికి సమర్పిస్తుంటారు. ఈ నేపథ్యంలో నేడు.. వేములవాడ బద్ది పోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించడానికి క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు.…
దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తులతో రద్దీగా మారింది. రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే మేడారం సమ్మక్క జాతర తెలంగాణకే తలమానికం. అయితే మేడారం సమ్మక్క-సారక్క జాతరకు వెళ్లే భక్తులు ముందుగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా మేడారం జాతర సందర్బంగా వేములవాడ రాజన్న దర్శనార్థం విచ్చేసిన భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది. స్వామి వారిని దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా..…
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. భక్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ నాస్తికుల రాజ్యాంగ మారిపోయిందన్నారు. సీఎం కేసీఆర్ వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం 400 కోట్లు కేటాయిస్తా అన్నాడు…ఊహ చిత్రాలు మాత్రమే చూపించాడని ఎద్దేవా చేశారు. మేడారం జాతర కంటే ముందుగా రాజన్నను దర్శించుకోవడం…
తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వైకుంట ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి దర్శనానికి భారీ భక్తులు విచ్చేశారు. రాజకీయ, సీని ప్రముఖులు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున 1.45 గంటలకే స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమైంది. అయితే 10 రోజుల పాటు ఈ వైకుంఠ ద్వారా దర్శనం కొనసాగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇటు తెలంగాణలో సైతం ఆలయాల్లో భక్తుల రద్దీ భారీగా ఉంది. వేకువజామునుంచే స్వామి…
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయ కార్తీక మాసోత్సవ సందర్భంగా ముస్తాబైంది. కార్తీక మాసం శివుడికి ఎంతో ప్రీతికరమైన నెల కావడంతో ప్రముఖ శైవ క్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయాన్ని విద్యుత్‌దీపాలంకరణలతో అంగరంగ వైభవంగా అలంకరించారు. ఆలయంలో నెల రోజుల పాటు స్వామి వారి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. స్వామి వారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. కరోనా నేపథ్యంలో…
తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ఎత్తివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అత్యవసర ప్రాతిపదికన శనివారం మధ్యాహ్నం సమావేశమైన మంత్రివర్గం లౌక్‌డౌన్, నైట్ కర్ఫ్యూలను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ ఎత్తివేసిన నేపథ్యంలో రేపటి నుండి వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో భక్తుల దర్శనాలు ప్రారంభం కానున్నాయని దేవస్థాన యాజమాన్యం తెలిపింది. గత నెల మే 12న ఆలయంలో భక్తుల దర్శనాలు నిలిపివేయగా.. 38 రోజుల అనంతరం భక్తుల దర్శనాలు ప్రారంభం కానున్నాయి. భద్రాచలం శ్రీ…
కరోనా సెకండ్‌వేవ్ పంజా విసురుతోంది.. కరోనా మహమ్మారి తొలినాళ్లలో అన్ని ఆలయాలు మూతపడి.. క్రమంగా ఆ తర్వాత తెరుచుకున్నాయి.. ఇప్పుడు సెకండ్ వేవ్ ఉధృతితో అధికారులు అప్రమత్తం అవుతున్నారు.. రాజన్నసిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో కరోనా కేసులు విజృంభిస్తుండడంతో.. ఈ నెల 18వ తేదీ నుండి 22 వరకు రాజన్న ఆలయాన్ని మూసివేయాలని నిర్ణయించారు అధికారులు.. మొత్తంగా ఐదు రోజుల పాటు భక్తుల దర్శనానికి అనుమతి రద్దు చేశారు దేవాదాయ శాఖ అధికారులు.. ఇక, ఈనెల 21న రాజన్న…