Vellampalli Srinivas Rao : ప్రతిపక్షంలో ఉండగా కరెంట్ చార్జీలు పెంచమని ప్రతీ వీధికి వెళ్లి తిరిగి మరీ చెప్పిన చంద్రబాబు అధికారంలోకి రాగానే ప్రజలపై పెనుభారం మోపారని మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా ఈనెల 27వ తేదిన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలతో కలసి నిరసన ర్యాలీలు చేపడుతున్నామన్నారు.. ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కూడా గడవక ముందే 15,485 కోట్ల భారం మోపారన్నారు. విద్యుత్…
కర్నూలు : మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు ఏపీ పై అవాకులు, చవాకులు పేలడం మంచిది కాదని మండిపడ్డారు వెల్లంపల్లి శ్రీనివాస్. బలవంతంగా తెలంగాణ రాష్ట్రాన్ని లాక్కున్నారు…. ఆర్ధికంగా బలంగా వున్నామని ఏపీ పై విమర్శలు మంచిది కాదని మండిపడ్డారు. శ్రీశైలం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తే నిధులు మంజూరుకు సీఎం జగన్ సుముఖంగా ఉన్నారన్నారు. మాజీ సీఎం చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలో లేనప్పుడు…
అమరావతి : దేవదాయ శాఖలో వీలైనంత త్వరలో ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించారు మంత్రి వెలంపల్లి శ్రీనివాస్. దేవదాయ శాఖపై ఇవాళ మంత్రి వెలంపల్లి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ… దేవదాయ శాఖలో నాడు-నేడు తరహాలో ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని… దేవాలయాలను పెద్ద ఎత్తున అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. దేవదాయ శాఖలో ఇతర శాఖల అధికారులను నియమించక తప్పని పరిస్థితి ఉందని… ఇతర శాఖలకు చెందిన హిందువులను మాత్రమే దేవదాయ శాఖలో నియమిస్తామని తెలిపారు.…
బెజవాడ దుర్గగుడిలో ఏసీబీ దాడులు ఎవరికి షాక్ ఇచ్చాయి? పెద్ద సంఖ్యలో ఉద్యోగులపై వేటు ఎవరికి మింగుడుపడటం లేదు? జరుగుతున్న పరిణామాలపై సన్నిహితుల దగ్గర అసహనం వ్యక్తం చేస్తున్న అమాత్యుల వారు ఎవరు? ఏసీబీ దాడులు.. మంత్రి శిబిరంలో కలకలం! దుర్గమ్మ చల్లని చూపు తమ మీద పడితే లైఫ్ హ్యాపీగా సాగిపోతుందని భావిస్తారు బెజవాడ జనం. రాజకీయ నేతలు సైతం అదే ఆశిస్తారు. అలాంటి అమ్మవారి ఆలయాన్ని ఏసీబీ బృందాలు మూడు రోజులు జల్లెడ పట్టడంతో…