కర్నూలు : మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు ఏపీ పై అవాకులు, చవాకులు పేలడం మంచిది కాదని మండిపడ్డారు వెల్లంపల్లి శ్రీనివాస్. బలవంతంగా తెలంగాణ రాష్ట్రాన్ని లాక్కున్నారు…. ఆర్ధికంగా బలంగా వున్నామని ఏపీ పై విమర్శలు మంచిది కాదని మండిపడ్డారు. శ్రీశైలం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తే నిధులు మంజూరుకు సీఎం జగన్ సుముఖంగా ఉన్నారన్నారు. మాజీ సీఎం చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలో లేనప్పుడు ఒకలా మాట్లాడుతారని.. వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. చంద్రబాబు నిజాలు మాట్లాడితే తల వేయి వక్కలు అవుతుందని వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో ఎప్పుడో అన్నారని వెల్లడించారు. కుప్పంలో జరిగే ఎన్నికలలో వైఎస్సార్ పార్టీ గెలుపు ఖాయమని వెల్లంపల్లి శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు.