భక్తి, కళ, నైపుణ్యానికి మేళవింపు అంటే సిరిసిల్ల చేనేతకారుల గొప్పతనం గుర్తుకు వస్తుంది. ఆ సంప్రదాయాన్ని మరోసారి ప్రపంచానికి గుర్తు చేస్తూ, శ్రీరామనవమి సందర్భంగా భద్రాచల సీతారాముల కల్యాణానికి ఒక అరుదైన పట్టు చీరను రూపొందించి ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు సిరిసిల్ల నేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్. ఈ చీరకు ప్రత్యేకత ఏమిటంటే – ఇది కేవలం పట్టు చీర మాత్రమే కాదు, ఇది భక్తి రూపంలో ఓ కళాత్మక కానుక. సీతమ్మకు అర్పించే ఈ బంగారు…
గతంలో ఒకే క్లాత్‌పై జి20 లోగోను నేసి యావత్ దేశం దృష్టిని ఆకర్షించిన సిరిసిల్ల టెక్స్‌టైల్ టౌన్‌కు చెందిన నేత వెల్ది హరిప్రసాద్, అయోధ్య శ్రీరామ మందిరంలోని సీతాదేవికి బంగారు చీరను నేసి మరో రికార్డు సృష్టించారు. జనవరి 22న జరగనున్న శ్రీరామ మందిర ప్రతిష్ఠాపన సందర్భంగా హరిప్రసాద్ బంగారు చీరను నేసారు. 900 గ్రాముల చీరను ఎనిమిది గ్రాముల బంగారం, 20 గ్రాముల పట్టు చారలతో 20 రోజులు వెచ్చించి నేశారు. శ్రీరాముని చిత్రాలతో పాటు,…
కళలకు కాదేదీ అనర్హం.. అన్న నానుడిని నిజం చేస్తూ పనిలోనే కళాత్మకతను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకుంటున్నాడు ఓ చేనేత కళాకారుడు.చేనేత వృత్తిని జీవనోపాధిగా ఎంచుకుని అందులోనే అద్భుతాలను సృష్టిస్తున్నాడు. గతంలో అగ్గిపెట్టలో ఇమిడే చీర, శాలువాలను తయారుచేయడంతో పాటు తన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎన్నో చిత్రాలను తన మగ్గంపై నేశాడు. తాజాగా చేనేత మగ్గంపై అగ్గి పెట్టెలో ఇమిడే చీర వన్ గ్రామ్ గోల్డ్ జరీతో నేశారు. దీంతో పాటు దబ్బనంలో నుండి దూరే…