Telangana University: తెలంగాణ యూనివర్సిటీ లో ఏసీబీ, విజిలెన్స్ బృందాల దాడుల టెన్షన్ మొదలైంది. నిన్న 8 గంటల పాటు యూనివర్సిటీలో తనిఖీలు చేపట్టిన అధికారుల బృందం కీలక దస్త్రాలు, హార్డ్ డిస్క్ ల స్వాధీనం చేసుకున్నారు.
నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. నిత్యం ఏదో ఒక సమస్యపై వార్తల్లో నిలుస్తోంది. పాలక మండలి నిర్ణయాలపై హై కోర్టు ఆశ్రయించాను అంటూ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొ. రవీందర్ గుప్తా అన్నారు.