నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. నిత్యం ఏదో ఒక సమస్యపై వార్తల్లో నిలుస్తోంది. పాలక మండలి నిర్ణయాలపై హై కోర్టు ఆశ్రయించాను అంటూ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొ. రవీందర్ గుప్తా అన్నారు. ప్రస్తుత రిజిస్ట్రార్ యాదగిరి నియామకం చెల్లదు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలు పాటించకపోతే రిజిస్ట్రార్ పై క్రిమినల్ కేసు పెడతామంటూ విమర్శించారు.
Also Read : Pakistan: మహిళల శవాలపై అత్యాచారం.. సమాధులకు తాళాలు వేస్తున్న తల్లిదండ్రులు..
ఈ వివాదం మొత్తం నవీన్ మిట్టల్ తోనే ప్రారంభమైందని వైస్ చాన్సలర్ ప్రొ. రవీందర్ గుప్తా అన్నారు. యూనివర్సిటీ పనులకు ఆటంకాలు కలిగిస్తున్నాడు అని ఆయన వెల్లడించారు. అయన చెప్పిన వాళ్ళను రిజిస్ట్రార్ గా పెట్టుకోవాలని ఒత్తిడి చేస్తున్నాడు తెలంగాణ యూనివర్సీటీ వైస్ ఛాన్సలర్ ఆరోపించారు. ఈసీ మీటింగ్ లో మా రిజిస్ట్రార్ విద్యావర్దిన్నీ మిట్టల్ గెట్ అవుట్ అన్నాడు అని ప్రో రవీందర్ గుప్తా తెలిపారు.
Also Read : Jyotika: సూర్య భార్య ఇంత ఘోరంగా అవి చేయడానికి కారణం ఏంటో..?
ఈసీ కి ఎలాంటి పవర్స్ లేవు.. మా రిజిస్ట్రార్ విద్యావర్దిన్నీ ఆలా ఎలా అంటారు అని నవీన్ మిట్టల్ తో గొడవ పడ్డాను అని ప్రొ. రవీంద్ర గుప్తా అన్నారు. రూ. 20 కోట్ల పండ్స్ రాకుండా నవీన్ మిట్టల్ అడ్డుకున్నాడు.. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు అసలు యూనివర్సటీని పట్టించుకోవడం లేదు అంటూ తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రవీంద్ర గుప్తా తెలిపారు.
Also Read : Weather Update: ఏపీలో మోస్తరు వర్షాలు పడే అవకాశం
తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదు.. ఎవరి వద్ద డబ్బులు తీసుకోలేదు అని తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొ. రవీందర్ గుప్తా తెలిపారు. డైలీ వెజెస్ కింద కార్మికులను నియమించాం.. అలా నియమించుకునే పవర్స్ నాకు ఉంటాయి అని ఆయన వెల్లడించారు. త్వరలో ఓయూ నుంచి కొత్త రిజిస్ట్రార్ ను నియామకం చేస్తాను అంటూ తెలంగాణ యూనివర్సిటీ వీసీ రవీందర్ గుప్తా అన్నారు.