ఆయనో సీనియర్ ఎమ్మెల్యే. టీడీపీ నుంచి గెలిచి అధికారపార్టీ పంచన చేరారు. నియోజకవర్గంపై ఆధిపత్యం కోసం తహతహలాడుతున్నారు. మొదట్లో అంతా బాగానే ఉన్నట్టు కనిపించినా ఇప్పుడు అసమ్మతి ఆరునొక్క రాగం అందుకుందట. దీంతో అంతర్యుద్ధంలో చిక్కుకున్న ఎమ్మెల్యే ఎలా బయటపడతారోననే చర్చ మొదలైంది. వాసుపల్లి పార్టీ మారినా వైసీపీలో పెద్దగా మార్పు లేదట! వాసుపల్లి గణేష్ కుమార్. విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే. 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచారు. టీడీపీ పవర్‌లో ఉన్నప్పుడు వైసీపీపై…