ఢిల్లీలో అగ్ని ప్రమాద ఘటనలు రోజు రోజుకు అవుతున్నాయి. ఇప్పటికే చాందినీ చౌక్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 50 దుకాణాలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం ఏర్పడింది. ఈ ప్రమాద ఘటన నుంచి తేరుకోక ముందే.. దేశ రాజధానిలో మరో ప్రమాదం సంభవించింది. దీంతో.. ఢిల్లీ వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు.. ఢిల్లీలో ఎండలు ఇప్పటికీ తీవ్రంగా ఉన్నాయి. ఆ కారణం చేత ఈ ప్రమాదాలు జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.