గత కొన్ని రోజులుగా హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, నిర్మాతల మండలి, దర్శకుల సంఘం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’ చిత్రంలో భజ గోవిందం పదాన్ని ఎరోటిక్ సీన్స్ నేపథ్యంలో వాడారని, దాన్ని వెంటనే తొలగించాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయని హెచ్చరించారు. పోలీస్ స్టేషన్స్ లోనూ కేసులు పెట్టారు. దాంతో దర్శకుడు యుగంధర్ తన ప్రమేయం లేకుండా ఆ పదం పొరపాటున ట్రైలర్ లో చేరిందని బేషరతుగా…
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య, హైదరాబాద్ బ్యూటీ రీతూవర్మ జంటగా లక్ష్మీసౌజన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వరుడు కావలెను’. నదియా, మురళీశర్మ, వెన్నెల కిశోర్, ప్రవీణ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇటీవలే విడుదల అయిన ఈ చిత్ర పోస్టర్లు, టీజర్, పాటలు సినిమాపై అంచనాలను పెంచాయి. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసినట్లు మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా లొకేషన్ లో డైరెక్టర్ తో హీరోహీరోయిన్లు కలిసి ఉన్న…
తెలుగునేలపై విశేషంగా వినిపించే జానపదగీతాలను సినిమాలకు అనువుగా ఉపయోగించుకోవడం కొత్తేమీ కాదు. ఇప్పుడు నాగశౌర్య హీరోగా తెరకెక్కిన ‘వరుడు కావలెను’ చిత్రంలో అలాంటి ఓ జానపదమే సందడి చేస్తోంది. ఆగస్టు 4న ‘వరుడు కావలెను’ చిత్రంలోని “దిగు దిగు నాగ…” అనే పాట లిరికల్ వీడియో విడుదలయింది. అలా వచ్చీ రాగానే ఈ పాట విశేషాదరణ పొందుతూ, కొన్ని గంటలకే మిలియన్ వ్యూస్ పట్టేసింది. ఈ పాటకు “దిగు దిగు దిగు నాగో నాగన్నా… దివ్యాసుందర నాగో…
హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై పలు చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. అయితే కరోనా కారణంగా వీటి షూటింగ్స్ కు బ్రేక్ పడింది. తాజాగా తెలంగాణలో సంపూర్ణంగా లాక్ డౌన్ ఎత్తివేయడం, కొవిడ్ 19 కేసులు తగ్గుముఖం పట్టడంతో ఫిల్మ్ ఛాంబర్ నిర్దేశించిన సూచనలను అనుసరిస్తూ పలు నిర్మాణ సంస్థలు షూటింగ్స్ మొదలు పెట్టాయి. సితార ఎంటర్ టైన్స్ మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ సైతం తమ చిత్రాలను తిరిగి పట్టాలెక్కించడం…
చాక్లెట్ బాయ్ నాగశౌర్య టాలీవుడ్ లోని టాలెంటెడ్ యంగ్ హీరోలలో ఒకడు. విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఆయన భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా సొంతం చేసుకున్నాడు. ఇటీవలే హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ 2020 లో డాషింగ్ హీరో 5 వ స్థానాన్ని దక్కించుకున్నాడు. తాజాగా ఈ యంగ్ హీరో పోస్ట్ చేసిన జిమ్ వర్కౌట్ సెషన్ పిక్ ఒకటి వైరల్ అవుతోంది. అందులో నాగశౌర్య మాచో రిప్డ్…
కరోనా పరిస్థితులు ఎప్పుడు తగ్గుముఖం పడతాయో తెలియదని పరిస్థితి నెలకొంది. దీంతో థియేటర్లు సైతం ఇప్పట్లో తెరచుకొనే అవకాశం కనిపించడం లేదు. ఇప్పుడు విడుదలకు రెడీగా ఉన్న సినిమాలకి ఒక్కటే ఆప్షన్ ‘ఓటీటీ’.. ఇప్పటికే చాలా సినిమాలు విడుదల అయ్యి ఆదరణ పొందగా.. మరిన్ని సినిమాలు ఓటీటీ బాట పట్టడానికి సిద్ధమవుతున్నాయి. తాజాగా ‘వరుడు కావలెను’ సినిమా ఓటీటీలో విడుదలవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. నాగశౌర్య-రీతువర్మ జంటగా నటించిన ఈ సినిమా ఈ నెలలోనే విడుదల కావాల్సి ఉంది.…