జనసేనాని పవన్ కల్యాణ్ ఏపీలో బిజీబిజీగా ఉన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే బీసీ సదస్సు, కాపు సంఘాలతో సమావేశం నిర్వహించారు.
Pawan Kalyan: విజయవాడలోని ఇంద్రకీలాద్రిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం ప్రత్యేకంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జనసేన ఎన్నికల ప్రచార రథం వారాహికి పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ ప్రచార రథంపై నుంచి జనసేనాని తొలిసారి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ సుభిక్షంగా ఉండాలని.. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి ముందుండాలని అమ్మవారిని కోరుకున్నట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఏపీలో జరుగుతున్న అరాచకాలను దుర్గమ్మ చూస్తోందని పవన్ వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాలు…
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ కొండగట్టుకు వెళ్లనున్నారు.. జనసేన పార్టీ ప్రచార రథం వారాహి వాహనానికి జగిత్యాల జిల్లా కొండగట్టులో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.. ఆంజనేయస్వామి ఆలయంలో అక్కడ శాస్త్రోక్తంగా పూజలు జరిపించనున్నారు పవన్… వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ వారాహికి పూజలు నిర్వహించి పవన్ ప్రచార రథాన్ని ప్రారంభిస్తారు. అనంతరం నాచుపల్లి సమీపంలోని ఓ రిసార్టులో తెలంగాణ ముఖ్య నాయకులతో సమావేశమవుతారు. సమావేశం అనంతరం ధర్మపురి చేరుకుని లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక…
Gudivada Amarnath: ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరువు, చంద్రబాబు కవల పిల్లలు అని ఆయన ఆరోపించారు. దావోస్ సదస్సుకు రాష్ట్రానికి ఆహ్వానం అందలేదనే దుష్ప్రచారాన్ని టీడీపీ ప్రారంభించిందని.. నవంబర్ 25నే ముఖ్యమంత్రి పేరు మీద ఆహ్వానం అందిందని మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నెంబర్ వన్ ఏపీ అని.. 97వేల కోట్ల రూపాయలు ఏపీ నుంచి ఎగుమతులు జరిగాయని వివరించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ…
Gudivada Amarnath: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహిపై మంత్రి గుడివాడ అమర్నాథ్ సెటైర్లు వేశారు. ఏపీకి వారాహి వస్తే అప్పుడు చూద్దామని వ్యాఖ్యానించారు. నిబంధనలకు అనుగుణంగా ఏపీ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఉందా లేదా అనేది ఇక్కడి అధికారులు చూస్తారన్నారు. ఒకవేళ నిబంధనల ప్రకారం లేకుంటే వాహనం మార్చాల్సిన అవసరం ఉండదని.. కేవలం రంగు మాత్రమే మార్చాల్సి ఉంటుందన్నారు. పవన్‌కు రంగులు మార్చడం తేలికే కదా అని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. 2014…
Varahi: పవన్ కళ్యాణ్ వారాహి వాహనానికి సంబంధించి మరో ట్విస్ట్ నెలకొంది. ఈ వాహనం రిజిస్ట్రేషన్ వాయిదా పడిందని వార్తలు వచ్చి కొద్దిగంటలు కూడా ముగియకముందే వారాహి రిజిస్ట్రేషన్ ఎప్పుడో పూర్తయిందని తెలంగాణ రవాణా శాఖ వెల్లడించింది. దీంతో జనసేన పార్టీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారాహికి లైన్ క్లియర్ అయిందని.. ఈ వాహనానికి అన్ని అనుమతులు ఉన్నాయని.. వారం కిందటే రిజిస్ట్రేషన్ కూడా పూర్తయిందని స్వయంగా తెలంగాణ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ పాపారావు వెల్లడించారు.…
Pawan Kalyan: కొన్నిరోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచార వాహనం వారాహిపై చర్చ నడుస్తోంది. ఆర్మీ కలర్‌లో వారాహి రంగు ఉండటం వివాదానికి కారణమైంది. వారాహి రంగుపై ఏపీలో అధికార పార్టీ నేతలు నేరుగా విమర్శలు చేశారు. అది వారాహి కాదని నారాహి అని.. ఆలివ్ గ్రీన్ రంగు కాకుండా పసుపు కలర్ వేసుకోవాలని చురకలు అంటించారు. అయితే ఏదేమైనా ప్రస్తుతం వారాహి వాహనం రిజిస్ట్రేషన్ వాయిదా పడింది. లారీ చాసిస్‌ను బస్సుగా మార్చడం, వాహనం…
Minister Roja: ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యాత్ర చేపట్టనున్న వారాహిపై అధికార పార్టీ వైసీపీ, జనసేన మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ అంశంపై పవన్ వరుసగా ట్వీట్లు చేసి వైసీపీపై విమర్శలు చేయగా.. తాజాగా మంత్రి రోజా ఆయనకు కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ వాహనం వారాహి కాదు నారాహి అంటూ సెటైర్ వేశారు. ఆయన వాహనం కలర్, చొక్కా కలర్ గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని.. ఎందుకంటే ఆయన కలర్ పసుపు…