ప్రముఖ నేపథ్య గాయని, అలనాటి మేటి సింగర్ వాణీ జయరాం అనుమానాస్పద స్థితిలో మృతి భారతీయ చలనచిత్ర పరిశ్రమను షాక్‌కు గురిచేసింది. శనివారం నాడు వాణీ జయరాం చనిపోయినట్లు వార్తలు రావడంతో చెన్నై నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
తెలుగు చిత్రసీమలో తనదైన వాణి వినిపించి, తనకంటూ ఓ బాణీని ఏర్పరచుకున్న మధురగాయని వాణీ జయరామ్ కీర్తి కిరీటంలో పద్మభూషణ్ అవార్డు చోటు చేసుకోవడం సంగీత ప్రియులందరికీ ఆనందం పంచుతోంది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్రప్రభుత్వం వాణీ జయరామ్ కు పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది. ఈ వార్త వినగానే దేశవిధేశాల్లోని వాణీ జయరామ్ అభిమానుల ఆనందం అంబరమంటింది. వాణీ జయరామ్ ప్రతిభకు కేంద్రం తగిన సమయంలో సరైన అవార్డును ప్రదానం చేస్తోందని పలువురు సంగీతాభిమానులు ప్రశంసిస్తున్నారు. తమిళనాట…
మనదేశంలో సంగీతప్రియులకు మహదానందం పంచే వాయిద్యాలు ఎన్ని ఉన్నా, వీణ, వేణువు అన్నవి మరింత ఆనందం పంచుతూ ఉంటాయి. ఆ రెండింటి సమ్మేళనంలా వాణీ జయరామ్ గానం ఉంటుందని ప్రతీతి. ఆమె గళంలో జాలువారిన అనేక గీతాలు అమృతం కురిపించాయి. ఉత్తరం, దక్షిణం అన్న తేడా లేకుండా వాణీ జయరామ్ గళం సంగీతాభిమానులను ఎంతగానో పులకింప చేసింది. తెలుగు చిత్రాలతోనే వాణీ జయరామ్ గానం ప్రత్యేకత సంతరించుకుంది. మొత్తం మూడు సార్లు జాతీయ స్థాయిలో ఉత్తమ గాయనిగా…