West Bengal: వెస్ట్ బెంగాల్‌లో దుర్గాపూజ సందర్భంగా పలు మండపాలపై దాడులు జరిగాయి. దీనిపై కలకత్తా హైకోర్టు రాష్ట్ర డీజీపీ నుంచి నివేదిక కోరింది. వివిధ జిల్లాల్లో దుర్గాపూజ సందర్భంగా జరిగిన సంఘటనలు, వారు తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది. ఈ మేరకు అన్ని జిల్లాల ఎస్పీలు డీజీపీకి నివేదిక సమర్పించాలని జస్టిస్ హిరణ్మోయ్ భట్టాచార్య నేతృత్వంలోని డివిజనల్ బెంచ్ ఆదేశించింది. డీజీపీ అన్ని నివేదికను పరిశీలించి, ఫైనల్ రిపోర్టుని హైకోర్టుకు సమర్పిస్తారు.…