విశాఖ జిల్లా వైసీపీలో కో-ఆర్డినేటర్లకు గడ్డుకాలం నడుస్తోంది. పశ్చిమ, దక్షిణ స్ధానాల్లో ఇంఛార్జుల పంచాయితీ చల్లారక ముందే.. తాజాగా తూర్పు నియోజకవర్గంలో తిరుగుబాటుకు చాప కింద నీరులా ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో అధికారపార్టీకి తూర్పు నియోజకవర్గం చాలా కీలకం. ఇక్కడ వరసగా మూడుసార్లు టీడీపీ గెలిచింది. 2019 ఎన్నికల్లోనే సిట్టింగ్ ఎమ్మెల్యేకు చెక్ పెట్టేందుకు వైసీపీ వ్యూహం రచించినా వర్కవుట్ కాలేదు. ఇప్పుడు అక్కడి టీడీపీలో అంతర్గత బలహీనతలు బయటపడి పరిస్థితిని మార్చేస్తున్నాయి.…