దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తుండటంతో కీలక బెంగళూరు నగరపాలక సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మాల్స్, థియేటర్లలో ప్రవేశానికి రెండు డోసుల వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ఇదే విధానాన్ని పబ్‌లు, రెస్టారెంట్‌లతో పాటుగా క్యాబ్‌లకు కూడా విస్తరింపజేయాలని బెంగళూరు నగరపాలక సంస్థ చూస్తున్నది. రాబోయే రోజుల్లో కేసులు భారీగా పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకోనున్నది. ప్రస్తుతం అందరివద్ద స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. Read: కరోనా వేళ…
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం టీటీడీ కీలకమైన ప్రకటన చేసింది. తిరుమలకు వచ్చే భక్తులు తప్పనిసరిగా కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తీసుకురావాలని స్పష్టం చేసింది. ఒకవేళ వ్యాక్సిన్ ఇంకా వేయించుకోని నేపథ్యంలో 48 గంటల ముందు ఆర్టీపీసీఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికెట్ తీసుకురావాలని తెలిపింది. ఈ విషయాన్ని గతంలోనే తాము ప్రకటించినా కొంత మంది భక్తులు పట్టించుకోకుండా తిరుమల కొండపైకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని టీటీడీ అసహనం వ్యక్తం చేసింది. Read Also: సంక్రాంతి సందర్భంగా…
చార్ ధామ్ యాత్రకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. యాత్రకు వచ్చే రోజువారీ భక్తుల పరిమితిని ఉత్తరాఖండ్ హైకోర్టు ఎత్తివేసింది… దీంతో… కీలక సూచనలు చేసింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం.. భక్తులు కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తిగా తీసుకున్న సర్టిఫికెట్ కానీ, 72 గంటలకు మించకుండా కోవిడ్ నెగటివ్ రిపోర్టు చూపించాలని రూల్స్ పెట్టింది. చార్‌ధామ్ యాత్రకు వచ్చే భక్తులు వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొంది సర్కార్. కాగా, హిమాలయ పుణ్యక్షేత్రాలైన గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్ మరియు కేదార్‌నాథ్ భక్తుల…
కరోనా సమయంలో వ్యాక్సినేషన్‌ను ప్రభుత్వం వేగవంతం చేసింది. కరోనా నుంచి బయటపడాలి అంటే వ్యాక్సిన్ ఒక్కటే పరిష్కారం కావడంతో ప్రజలు ముందుకు వచ్చి వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే, ఉత్తర ప్రదేశ్‌లోని మేరఠ్‌కు చెందిన రామ్‌పాల్ సింగ్ అనే వ్యక్తి రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నాడు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నాక సదరు వ్యక్తి వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ను డౌన్‌లోడ్ చేసుకున్నాడు. కాగా, అందులో ఐదు డోసులు తీసుకున్నట్టుగా ఉండటంతో షాక్ అయ్యాడు. మార్చి 16న…
వ్యాక్సిన్ల కొరత అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ తీవ్రంగా తప్పుపట్టింది. వ్యాక్సిన్ సమస్య ఉత్పన్నం కావడానికి మోదీయే కారణమన్నారు. మోదీ సర్కార్ గత ఏడాదే వ్యాక్సినేషన్ ప్లాన్ వేసిందని, కానీ ఈ ఏడాది జనవరిలో కేవలం కోటి 60 లక్షల టీకాలకు మాత్రమే ఎందుకు ఆర్డర్ చేశారని ఆమె ప్రశ్నించారు. దేశ ప్రజలకు మోదీ ప్రభుత్వం తక్కువ సంఖ్యలో టీకాలు కేటాయించిందని, కానీ ఎక్కువ సంఖ్యలో విదేశాలకు టీకాలు అమ్మినట్లు ప్రియాంకా ఆరోపించారు.…