బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా బీజేపీకి బీ-టీమ్ అని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటే అని ఆయన తెలిపారు. కేసీఆర్ కు వ్యతిరేఖంగా మాట్లాడుతున్నడనే బీసీ బిడ్డ అయిన బండి సంజయ్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదా నుంచి తప్పించారు అని హనుమంతరావు అన్నారు. అబ్కీ బార్ కాంగ్రెస్ సర్కార్ అంటూ ఆయన తెలిపారు..
మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హనుమంతరావు రావు ఇంటి పైన దుండగుల దాడిని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో హనుమంతరావుతో రేవంత్ రెడ్డి ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి.హనుమంతరావు ఇంటిపై దుండగులు అర్ధరాత్రి దాడి చేసి రాళ్లు వేయడంతో ఇంటి అద్దాలు.. కారు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ… తెలంగాణలో రోజు రోజుకూ శాంతి భద్రత లు…
తెలంగాణ కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాజీనామా ఎపిసోడ్‌కు తెరపడినట్లు కనిపిస్తుంది. తాజా ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ.. కాసేపట్లో సోనియా గాంధీకి జగ్గారెడ్డి లేఖ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా త్వరలో పార్టీకి రాజీనామా చేస్తున్నానని, అవమానాలు భరిస్తూ పార్టీలో ఉండలేనని ఆయన స్పష్టం చేశారు. పార్టీ సభ్యత్వం, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తానని ఆయన వెల్లడించారు. పార్టీలో ఎవరు మాట్లాడలేని సందర్భంలో రాహుల్ గాంధీ సభ పెట్టించానని ఆయన తెలిపారు. నా భార్య నీ…