China: చైనాలో ముస్లింలపై అణిచివేత కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా జిన్జియాంగ్ ప్రావిన్సులో నివసించే ముస్లింలను చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇస్లాంను ఆచరించకుండా అక్కడి ప్రజలపై నిర్బంధం కొనసాగుతూనే ఉంది. చాలా మంది ముస్లింలకు బ్రెయిన్ వాష్ చేస్తుంది. ఇదిలా ఉంటే ఇటీవల రంజాన్ పండగ సందర్భంగా చైనా అధికార యంత్రాంగా వీగర్ ముస్లింలు ప్రార్థనలు చేసుకోవడానికి కూడా అనుమతించలేదు రేడియో ఫ్రీ ఏషియా తన కథనంలో పేర్కొంది.