Minister Narayana: వేస్ట్ టు ఎనర్జీ రంగాన్ని అభివృద్ధి పరచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న చర్యలలో భాగంగా మంత్రి నారాయణ తాజాగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని ఆధునిక ప్లాంట్లను సందర్శించారు. సోమవారం (జూన్ 9) రాత్రి ఆయన మహారాష్ట్రలోని పింప్రీ చించవాడ్ మున్సిపల్ కార్పొరేషన్ (PCMC) వద్ద ఉన్న వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌ను పరిశీలించారు. ఈ ప్లాంట్ ద్వారా ప్రతి రోజూ నగర చెత్తను ఆధారంగా చేసుకుని సుమారు 14 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.…
ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో ఒక సంచలనాత్మక సంఘటన వెలుగులోకి వచ్చింది. బక్రీద్ సందర్భంగా ఇస్ముహమ్మద్ అన్సారీ మేకలను వధించడానికి ఉపయోగించే భుజలి అనే ఆయుధంతో తన మెడను కోసుకుని ఆత్మాహుతి చేసుకున్నాడు. ఈ సంఘటనతో ఆ ప్రాంత ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. పోలీసులు సంఘటనా స్థలం నుంచి ఒక సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఇస్ముహమ్మద్ సంచలన విషయాలు రాసుకొచ్చారు. నేను అల్లాహ్ దూత పేరు మీద నన్ను నేను బలి ఇస్తున్నానని పేర్కొన్నాడు. తనను…
ఈద్-ఉల్-అఝా(బక్రీద్) పర్వదినం సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముస్లి సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ త్యాగం, అంకితభావం, అల్లాహ్‌పై అచంచల విశ్వాసానికి ప్రతీక అని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. ఈద్-ఉల్-అఝా పండుగ మనం కలిసి జీవించడానికి, సామాజిక సామరస్యాన్ని కాపాడుకోవడానికి ప్రేరేపిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు.
భారత క్రికెటర్ రింకూ సింగ్ బ్యాచిలర్ లైఫ్ కు బైబై చెప్పే టైమ్ దగ్గరపడుతోంది. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్, క్రికెటర్ రింకు సింగ్ వివాహ తేదీ ఖరారైంది. నవంబర్ 18న ఇద్దరూ వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. జూన్ 8న నిశ్చితార్థం జరగనుంది. ఇద్దరి ఉంగరోత్సవ వేడుక లక్నోలోని ఒక హోటల్లో జరుగుతుంది. ఈ ఏడాది జనవరిలో, క్రికెటర్ రింకు సింగ్ సమాజ్ వాదీ పార్టీ ఎంపీతో పెళ్లి ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. రింకూకి కాబోయే…
Abbas Ansari: మాఫియా డాన్ ముఖ్తార్ అన్నారీ కుమారుడు అబ్బాస్ అన్సారీని ‘‘ద్వేషపూరిత ప్రసంగం’’ కేసులో కోర్టు దోషిగా తేల్చింది. ఉత్తర్ ప్రదేశ్ మౌ సదర్ ఎమ్మెల్యేగా ఉన్న అబ్బాస్‌కి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. కోర్టు తీర్పుతో ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం, అతడి ఎమ్మెల్యే పదవి రద్దు అవుతుంది. 2022లో అధికారులను బెదిరిస్తూ ఆయన ద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. ఇదే కేసులో ఆయన సోదరుడు మన్సార్ అన్సారీని కూడా దోషిగా తేల్చింది, ఇతడికి ఆరు…
ఆపరేషన్ సిందూర్ సందర్భంగా బ్రహ్మోస్ క్షిపణులు మన దేశ శత్రువులకు నిద్ర లేకుండా చేశాయని ప్రధాని మోడీ అన్నారు. శుక్రవారం ప్రధాని మోడీ ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ర్యాలీ నిర్వహించారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లఖింపూర్ ఖేరీలో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. తన భార్య ప్రేమ వ్యవహారంతో విసిగిపోయిన భర్త.. పంచాయితీ పెద్దల ముందు ఆమెను ప్రియుడికి అప్పగించాడు. నిఘాసన్ ప్రాంతంలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జార్ఖండ్‌లోని ఖర్బానీకి చెందిన ఓ మహిళ 18 సంవత్సరాల క్రితం అదే ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడిని వివాహం చేసుకుంది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ పరిధి బితూర్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న రతన్ ప్లానెట్ అపార్ట్‌మెంట్స్‌లో పార్కింగ్ విషయంపై గొడవ జరిగింది. ఈ చిన్న వివాదం భయంకరమైన మలుపు తిరిగింది. పార్కింగ్ విషయంలో జరిగిన వివాదంలో.. ఓ యువకుడు అపార్ట్మెంట్ కార్యదర్శి, రిటైర్డ్ ఇంజనీర్ ముక్కు కొరికాడు. ఈ వార్త ప్రస్తుతం ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
పెద్దల నిర్లక్ష్యం కారణంగా పిల్లలు లిఫ్టుల్లో ఇరుక్కుని ప్రాణాలు కోల్పోతున్నారు. అయినప్పటికీ అదే ఏమరపాటుగా ఉంటున్నారు. పిల్లలు తెలిసి తెలియక లిఫ్ట్ ఎక్కి ఆ తర్వాత కదులుతున్న సమయంలో డోర్స్ ఓపెన్ చేస్తూ తుంటరి పనులు చేస్తుండడంతో లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోతోంది. తాజాగా ఇలాంటి ఘటనే ఘజియాబాద్ లో చోటుచేసుకుంది. కౌశాంబి ప్రాంతంలోని ఓ అపార్ట్ మెంట్ లో మైనర్ బాలుడు లిఫ్ట్ తలుపు తెరిచి దానిలో చిక్కుకున్నాడు. చాలాసేపటి తర్వాత బాలుడిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.…
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ, 35 ఏళ్ల మహిళ తన మైనర్ మేనల్లుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అంతే కాకుండా అతనితో కలిసి జీవించాలని పట్టుబడుతోంది. అతడే తన భర్త అని చెబుతోంది. మైనర్ బాలుడి కుటుంబీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు సమాచారం అందించారు. మహిళా పోలీసులు అక్కడికి చేరుకున్నారు.. మైనర్ వయస్సు ధృవీకరణ పత్రం ద్వారా ఈ సమస్యను పరిష్కరించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.