CM Vijay: “1967 నాటి తప్పు పునరావృతం కావొద్దు”.. ప్రధాని మోడీకి సీఎం విజయ్ లేఖ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Vijay: దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) వివాదం మళ్లీ తీవ్రరూపం దాల్చింది. లోక్‌సభ స్థానాల సంఖ్యను శాశ్వతంగా 543 వద్దే నిలిపివేసేలా తక్షణమే రాజ్యాంగ సవరణలు చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి గురువారం లేఖ రాశారు. ఈ అంశంపై బుధవారం తమిళనాడు శాసనసభలో ఆమోదించిన ప్రత్యేక తీర్మానాన్ని ప్రస్తావిస్తూ, దక్షిణాది హక్కుల పరిరక్షణే లక్ష్యంగా ఆయన ప్రధాని దృష్టికి కొన్ని కీలక అంశాలను తీసుకెళ్లారు. లేఖలోని వివరాల ప్రకారం.. ప్రస్తుతం ఉన్న లోక్‌సభ మొత్తం స్థానాల సంఖ్య 543ని శాశ్వతం చేయడంతో పాటు, ప్రస్తుతం ఏ ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు ఉన్నాయో ఆ సంఖ్యను కూడా యథాతథంగా కొనసాగించాలని విజయ్ డిమాండ్ చేశారు. కొత్త సెన్సస్ (జనాభా లెక్కల) ఆధారంగా, రాజ్యాంగంలోని ఆర్టికల్ 81(2)(ఎ) ప్రకారం సీట్ల కేటాయింపు చేపడితే దక్షిణాది రాష్ట్రాలు తమ లోక్‌సభ స్థానాలను కోల్పోయే ప్రమాదం ఉందని అసెంబ్లీ ఆందోళన వ్యక్తం చేసింది. గతంలో అంటే 1967 పునర్విభజన సమయంలో కూడా తమిళనాడు తన లోక్‌సభ స్థానాలను 41 నుంచి 39కి కోల్పోవాల్సి వచ్చిందని, మళ్లీ అలాంటి చారిత్రక తప్పిదం పునరావృతం కాకూడదని లేఖలో స్పష్టం చేశారు.
జనాభా నియంత్రణ కార్యక్రమాలను ఎంతో సమర్థవంతంగా అమలు చేసి, ఆర్థిక ప్రగతి, వైద్యం, ప్రజారోగ్యం, సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలిచినందుకు దక్షిణాది రాష్ట్రాలకు శిక్ష వేయడం ఎంతవరకు సమంజసమని తీర్మానం ప్రశ్నించింది. 1971 తదుపరి జనాభా ఆధారంగా స్థానాలను మార్చితే, అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు తీరని అన్యాయం చేసినట్లవుతుందని విజయ్ పేర్కొన్నారు. దీంతో పాటు, సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ అంశాన్ని కూడా ఆయన ప్రధానంగా లేఖలో ప్రస్తావించారు. రాబోయే లోక్‌సభ ఎన్నికలతో పాటు, ఆ తర్వాత జరిగే అన్ని రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఈ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించి, అవసరమైన రాజ్యాంగ సవరణలను తక్షణమే తీసుకురావాలని లేఖ ద్వారా సీఎం విజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!