తిరుపతిలో ప్రసిద్ధి చెందిన శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో ఈనెలలో విశేష ఉత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు విశేష ఉత్సవ వివరాలను ఆలయ అధికారులు వెల్లడించారు. మే 5న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ భాష్యకార్లువారి శాత్తుమొర కార్యక్రమం ఉంటుందన్నారు. మే 5న ఉదయం 7 గంటలకు శ్రీభాష్యకార్లు స్వామి, సాయంత్రం 5:30 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామి, శ్రీ భాష్యకార్లు స్వామి ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహిస్తారని తెలిపారు. అటు మే…