PM Modi: అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ సమయంలో ఆయన మాట్లాడుతూ.. యూఎస్‌లో అక్రమంగా ఉంటున్న తమ పౌరుల్ని భారత్ తిరిగి స్వీకరింస్తుందని చెప్పారు. అదే సమయంలో మానవ అక్రమ రవాణాని అంతం చేయడానికి ప్రయత్నాలు అవసరమని చెప్పారు. ట్రంప్, మోడీ సంయుక్త మీడియా సమావేశంలో అక్రమ వలసలపై అడిగిన ప్రశ్నకు మోడీ సమాధానం ఇచ్చారు. ఒక దేశంలోకి అక్రమంగా ప్రవేశించే ఎవరికైనా అక్కడ నివసించే హక్కు లేదని ప్రపంచమంతటికీ ఇది వర్తిస్తుందని ప్రధాని మోడీ అన్నారు.
Read Also: Ravibabu : ఎన్టీఆర్ హైట్ గురించి నిజంగా ఆ డైరెక్టర్ అంత మాట అన్నాడా.. ?
ఇటీవల, అమెరికా నుంచి అక్రమ వలసదారుల్ని బహిష్కరించడాన్ని ట్రంప్ సర్కార్ ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే తొలి విడతలో 104 మంది అక్రమంగా యూఎస్‌లో ఉంటున్న భారతీయుల్ని బహిష్కరించింది. వీరిని అమెరికా సైనిక విమానంలో అమృత్‌సర్‌కి తీసుకువచ్చారు. ‘‘భారత్‌లోని చాలా మంది యువకులు, పేద ప్రజలు వలసల బారిన పడి మోసపోతున్నారు. వీరు చాలా సాధారణ కుటుంబాల నుంచి వచ్చినవారు. పెద్ద కలలు, పెద్ద హామీలకు ఆకర్షితమవుతున్నారు. చాలా మందిని ఎందుకు తీసుకెళ్తున్నారో తెలియకుండానే తీసుకువస్తున్నారు. చాలా మందిని మానవ అక్రమ రవాణా వ్యవస్థ ద్వారా తీసుకువస్తున్నారు’’ అని మోడీ అన్నారు. మానవ అక్రమ రవాణా ఎకో సిస్టమ్‌ని అంతం చేయడానికి భారత్, అమెరికా సంయుక్తంగా పనిచేయాలని అన్నారు. మా అతిపెద్ద పోరాటం ఈ ఎకోసిస్టమ్ మీదనే అని, అధ్యక్షుడు ట్రంప్ దీనికి సహకరిస్తారని విశ్వసిస్తాము అని అన్నారు.