US Visa: అమెరికా డ్రీమ్స్ లో ఉన్నవారికి శుభవార్త చెప్పింది అమెరికా. వీసాల ప్రక్రియ వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. తొలిసారి వీసా కోసం అప్లై చేసుకునే వారికి ఇది గుడ్ న్యూస్. వీసా ఇంటర్వ్యూ కోసం నిరీక్షించే వారి సమయాన్ని తగ్గించేందుకు భారత్ లోని అమెరికా దౌత్యకార్యాలయాలు తొలిసారిగా శనివారాల్లో కూడా ఇంటర్వ్యూ ప్రక్రియను ప్రారంభించాయి. ఈ నెల 21న ఇలా శనివారం ఇంటర్వ్యూలు చేశాయి.
వ్యాపారం లేదా విశ్రాంతి కోసం యునైటెడ్ స్టేట్స్‌ని సందర్శించాలని ప్లాన్ చేస్తున్నారా? మళ్లీ ఆలోచించండి. ఎందుకంటే మీరు కొంతకాలం వేచి ఉండాల్సి ఉంటుంది. దాదాపు మూడేళ్లు అంటే దాదాపు 1000 రోజులు వేచి ఉండాల్సిందే. నాన్-ఇమ్మిగ్రెంట్ విభాగంలో ఎవరైనా బీ1(బిజినెస్), బీ2(టూరిస్ట్) వీసాపై అమెరికా వెళ్లేందుకు దరఖాస్తు చేసుకుంటే వారికి 2025 జూన్ లేదా జులైలో వీసా అపాయింట్‌మెంట్ లభించనుంది.