చైనా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్‌లో అడుగుపెట్టారు. తైవాన్ ఎయిర్‌పోర్ట్‌లో భారత కాలమానం ప్రకారం.. మంగళవారం రాత్రి దిగిన ఆమెకు ఘనస్వాగతం లభించింది. ఆ వెంటనే చైనాకు వ్యతిరేకంగా స్పందించారు. తైవాన్‌ను ఏకపక్షంగా కలిపేసుకోవాలన్న చైనా చర్యలను అమెరికా వ్యతిరేకిస్తుందన్నారు.