గాజాలో శాంతి వాతావరణం నెలకొనడంతో ప్రపంచ వ్యాప్తంగా ట్రంప్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆయా దేశాధినేతలంతా ట్రంప్‌ను అభినందిస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కూడా చేశారు. తొలిసారి ట్రంప్‌ను బైడెన్ అభినందించారు.
Donald Trump Health Report: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైద్య పరీక్షల నివేదిక విడుదలైంది. ట్రంప్ అసాధారణ ఆరోగ్యంతో ఉన్నట్లు నివేదిక వర్ణించింది. శుక్రవారం వైట్ హౌస్ విడుదల చేసిన నివేదికలో ఓ విస్తుపోయే నిజం వెల్లడైంది. ట్రంప్ హృదయ వయస్సు ఆయన వాస్తవ వయస్సు కంటే 14 సంవత్సరాలు చిన్నదని పేర్కొంది. ఈ వైద్య పరీక్షలను వైట్ హౌస్ వైద్యుడు సీన్ బార్బబెల్లా నిర్వహించగా.. ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ విడుదల చేశారు.
హార్వర్డ్ యూనివర్సిటీ మధ్య ట్రంప్ పరిపాలన మధ్య వివాదం నెలకొంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి హార్వర్డ్ విశ్వవిద్యాలయంపై కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. యూనివర్సిటీకి అందించే సాయాన్ని నిలిపివేయడంతో పాటు పాఠ్యాంశాలు మార్చాలంటూ ఆదేశాలు ఇచ్చారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సౌదీ అరేబియాలో పర్యటిస్తున్నారు. పశ్చిమాసియా పర్యటనలో భాగంగా మంగళవారం సౌదీ అరేబియా చేరుకున్నారు. ట్రంప్‌నకు యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ స్వాగతం పలికారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి రోజుకో వార్త వింటూనే ఉంటాం. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆయన తీసుకునే కీలక నిర్ణయాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటు ఉన్నాడు. అక్కడి ప్రజలే కాదు.. ట్రంప్ బెదిరింపులతో ఆ దేశానికి వెళ్లడానికి భారతీయులతో పాటు విద్యార్థులు భయపడుతున్నారు. ఇక రాజకీయాల విషయం పక్కన పెడితే తాజాగా ట్రంప్‌ను ఉద్దేశించి అమెరికన్ ఫిల్మ్ మేకర్ క్రిస్ కొలంబస్ షాకింగ్ విషయాలు పంచుకున్నాడు. Also Read: Lokesh : ఆ స్టార్…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్-రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. నిన్నామొన్నటి దాకా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీపై గరం గరంగా ఉన్న ట్రంప్.. ఇప్పుడు డైరెక్షన్ మారింది. తాజాగా పుతిన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉక్రెయిన్‌పై యుద్ధం ముగించడానికి ఇప్పటికే శాంతి చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. సౌదీ అరేబియా వేదికగా రష్యాతో అమెరికా అధికారులు చర్చలు జరిగించాయి. పలుమార్లు జరిగిన చర్చల్లో కీలక పురోగతి లభించింది. ఇక మంగళవారం మరొక కీలక అడుగుపడనుంది.