S Jaishankar: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ అమెరికా అధ్యక్ష ఎన్నికల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య ఎన్నికల పోటీపై స్పందిస్తూ.. భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు గత ఐదు అధ్యక్షుల కాలంలో స్థిరమైన పురోగతి సాధించాయని అన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలతో సంబంధం లేకుండా భారత్-యూఎస్ సంబంధాలు మాత్రమే పెరుగుతాయని చెప్పారు.
రేపే (మంగళవారం) పోలింగ్ జరగనుండగా ఇప్పటికే 6.8 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ తమ ప్రచార చివరి అంకంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ట్రై చేస్తున్నారు.
ఈసారి అమెరికా ఎన్నికల్లో భారత ఓటర్లు కీ రోల్ పోషించనున్నారు. అమెరికాలో భారతీయ ఓటర్లు అధికంగా ఉన్నారు. ఇక్కడకు వచ్చి సెటిల్ అయినవారే కాకుండా.. గ్రీన్ కార్డు హోల్డర్లు కూడా ఓటు వేసే అవకాశం ఉంది.
అరిజోనాలోని డగ్లస్‌కు చెందిన యూఎస్- మెక్సికో సరిహద్దు ప్రాంతాన్ని డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలాహారిస్ సందర్శించారు. ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ.. దేశంలోకి అక్రమ వలసలను నివారించేందుకు అమెరికా సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తానని కీలక వ్యాఖ్యలు చేశారు.
Donald Trump: అమెరికా పర్యటనకు వెళ్లనున్న భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో వచ్చే వారం సమావేశం అవుతానని మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.
Sunita Williams: బోయింగ్ స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యల కారణంగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలిమమ్స్, బుచ్ విల్‌మోర్ స్పందించారు. ఈ సందర్భంగా సునీత విలియమ్స్ మాట్లాడుతూ.. అమెరికాలో త్వరలో జరగబోయే ఎన్నికల గురించి వారు ప్రస్తావించారు. ఈ ఎన్నికల్లో తాము అంతరిక్షం నుంచే ఓటు హక్కును వినియోగించుకుంటామని చెప్పుకొచ్చారు. పౌరులుగా ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోవడం చాలా ముఖ్యం అని తెలిపారు.
Donald Trump: పెన్సిల్వేనియాలో తనపై కాల్పులు జరిపిన ప్రదేశం నుంచే మళ్లీ ర్యాలీ నిర్వహిస్తానని అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
Kamala Harris vs Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా ఆఫ్రికా- భారత సంతతి అమెరికన్ కమలా హారిస్ కు అన్నివైపుల నుంచి సపోర్టు లభిస్తుంది. ఈ తరుణంలో ఆమె తన ప్రత్యర్థి అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు.
Elon Musk: యూఎస్ బిలినీయర్ ఎలన్ మస్క్.. డొనాల్డ్ ట్రంప్ పార్టీకి మద్దతుగా నిలిచాడు.. ఇందులో భాగంగానే ఆ పార్టీకి భారీ విరాళం అందించాడు. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున మరోసారి ట్రంప్ పోటీలో ఉండబోతున్నారు.
Nikki Haley: 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన ఇండో-అమెరికన్ నేత నిక్కీ హేలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశం అమెరికాతో భాగస్వామిగా ఉండాలని అనుకుంటోందని అయితే, ప్రస్తుతం అమెరికా ప్రపంచానికి నాయకత్వం వహిస్తుందని భారత్ విశ్వసించడం లేదని ఆమె అన్నారు. ప్రస్తుతం భారత్ అమెరికాను బలహీనంగా చూస్తోందని, ప్రస్తుతం ప్రపంచ పరిస్థితుల్లో భారత్ తెలివిగా ఆట ఆడుతోందని, రష్యాతో సన్నిహితంగా ఉంటోందని ఆమె అన్నారు.