Donald Trump: వచ్చే ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ తరుపున డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధ్యక్ష పదవికి పోటీ పడాలని అనుకుంటున్నారు. ఇప్పటికే తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన ఆయన అమెరికాలో ఎన్నికల ప్రచారాన్ని కూడా మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే మరోసారి ఆయన రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై స్పందించారు. ఫాక్స్ న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్ వివాదాన్ని తాను 24 గంటల్లో పరిష్కరించగలనని తెలిపాడు. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలకు అధ్యక్షత వహించడం…