Kamala Harris: అక్రమ వలసలపై కమలా హారిస్ కీలక వ్యాఖ్యలు..
- అక్రమ వలసలను నివారించేందుకు భద్రత ఏర్పాటు చేస్తాం..
- యూఎస్‌లో నివాసముంటున్న వారికి పౌరసత్వం కల్పిస్తాం: కమలా హారిస్ నాలుగేళ్లుగా అక్రమ వలసలు సమస్య గుర్తుకు రాలేదు: డొనాల్డ్ ట్రంప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kamala Harris: ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్, కమలాహారిస్ పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అరిజోనాలోని డగ్లస్‌కు చెందిన యూఎస్- మెక్సికో సరిహద్దు ప్రాంతాన్ని డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలాహారిస్ సందర్శించారు. ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ.. దేశంలోకి అక్రమ వలసలను నివారించేందుకు అమెరికా సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తానని కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఇమిగ్రేషన్ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తాని చెప్పింది. ఎన్నోఏళ్లుగా యూఎస్‌లో నివాసముంటున్న ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేని వలసదారులకు పౌరసత్వం కల్పించడంతో పాటు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కమలా హారిస్ వెల్లడించారు.
Read Also: Bandi Sanjay: మమ్మీ, డాడీ కల్చర్ మనకొద్దు… అమ్మానాన్నే ముద్దు..
Also Read
- Pakistan Army Plane Crash: పాకిస్థాన్‌లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
- Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
ఇక, డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న నాలుగేళ్లలో విచ్ఛిన్నమైన ఇమిగ్రేషన్ వ్యవస్థను సరి చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కమలా హారిస్ ఆరోపించారు. ఇమిగ్రేషన్ ఏజెంట్ల కొరత సమస్యను కూడా పరిష్కరించలేదని విమర్శించింది. విదేశీయులు దేశంలోకి ప్రవేశించడానికి ఎలాంటి చట్టబద్ధమైన మార్గాలను రూపొందించలేదన్నారు. ఈవిధంగా రాజకీయాలు చేయడానికి ప్రజలను ఉపయోగించుకునే వారికంటే దేశ భద్రత గురించి శ్రద్ధ వహించే వారికి ఎన్నికల్లో ప్రజలు తమ సపోర్టు ఇవ్వాలని ఆమె కోరింది. మాజీ సరిహద్దు రాష్ట్ర అటార్నీ జనరల్‌గా విధులు నిర్వహించిన తనకు సరిహద్దు దగ్గర భద్రత, చట్టాలను అమలు చేయడం లాంటి వాటిపై అవగాహన ఉందన్నారు. గతంలో తాను తుపాకులు, మాదకద్రవ్యాలు, మానవుల అక్రమ రవాణా లాంటి వాటిపై అంతర్జాతీయ క్రిమినల్ సంస్థలను విచారించినట్లు కమలా హారిస్ తెలిపారు.
Read Also: Suicide Case: దారుణం.. నలుగురు వికలాంగ కూతుళ్లతో సహా తండ్రి ఆత్మహత్య.!
కాగా, కమలా హారిస్ వ్యాఖ్యలపై రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. నాలుగేళ్లుగా సరిహద్దు వద్దకు వెళ్లని హారిస్‌కు ఎన్నికల వేళ అక్రమ వలసల సమస్య గుర్తొచ్చిందాని క్వశ్చన్ చేశారు. సరిహద్దులకు వెళ్లి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు.. ఆ సమస్య గురించి ఆలోచించే వారే అయితే నాలుగేళ్లుగా సరిహద్దు దగ్గరకు వెళ్లకుండా ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. హింసాత్మక మూకలు అమెరికాలో ప్రవేశించి ఇక్కడ హత్యలు, అత్యాచారాలు చేస్తున్నా.. ఆమె పట్టించుకోలేదన్నారు. చిన్న పట్టణాలను అన్నింటినీ కమలా హారిస్ శరణార్థుల శిబిరాలుగా మార్చేశారని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?