Pakistan: పాకిస్థాన్ రహస్యంగా అణ్వాయుధాలను పరీక్షిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వాదనను పాక్ తోసిపుచ్చింది. పాకిస్థాన్ అణు పరీక్షలను తిరిగి ప్రారంభించిన మొదటి దేశం కాదని ఓ పాకిస్థాన్ సినియర్ అధికారి అన్నారు. "పాకిస్థాన్ అణు పరీక్షలు నిర్వహించిన మొదటి దేశం కాదు.. అలాగే అణు పరీక్షలను తిరిగి ప్రారంభించిన మొదటి దేశం కూడా కాబోదు." అని తెలిపారు. అమెరికా అధ్యక్షుడి వాదనను అబద్ధాలకోరుగా తోసిపుచ్చారు. కాగా.. పాకిస్థాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్,…
Pakistan: పాకిస్తాన్‌లో ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల చీఫ్‌గా, సీఐఏ అధికారిగా 15 ఏళ్ల పనిచేసిన జాన్ కిరియాకౌ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించారు. పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ మిలియన్ల కొద్ది అమెరికా సాయం తీసుకున్న విషయాన్ని వెల్లడించారు. ఆయన హయాంలోనే పాకిస్తాన్ అణ్వాయుధాలను అమెరికా నియంత్రించిందని పేర్కొన్నారు. ముషారఫ్ అణు నియంత్రణను అమెరికాకు అమ్మేశాడని ఆయన అన్నారు.
India-Pakistan: అమెరికా నిఘా ఏజెన్సీ అయిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) మాజీ అధికారి చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ముఖ్యంగా, పాకిస్తాన్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ దేశంలో తప్పకుండా ప్రకంపనలు సృష్టిస్తాయి. 2001 పార్లమెంట్ దాడుల తర్వాత భారత్-పాకిస్తాన్‌లు యుద్ధానికి దిగుతాయని సీఐఏ విశ్వసించిందని జాన్ కిరియాకౌ అన్నారు. ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Pakistan: ద్రోహం, వంచనకు మారుపేరు ‘‘పాకిస్తాన్’’. ఇన్నాళ్లు కష్టకాలంలో ఆర్థికంగా, సైనికంగా రక్షిస్తూ వస్తున్న డ్రాగన్ కంట్రీ చైనాకు పాకిస్తాన్ నమ్మకద్రోహం చేస్తోంది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌లు అమెరికా పంచన చేరి, చైనా ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నారు. రెండు దేశాల మధ్య పాకిస్తాన్ డేంజరస్ గేమ్ ఆడుతోంది. ఇటీవల, పాకిస్తాన్ ట్రంప్‌తో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతోంది. ముఖ్యంగా, ఇరు దేశాల మధ్య ‘‘ఖనిజ ఒప్పందం’’ కుదిరింది. దీంతో బలూచిస్తాన్…
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌లపై ప్రశంసలు కురిపించారు. సోమవారం వైట్ హౌస్ ప్రెస్ మీటింగ్‌లో మాట్లాడుతూ.. ఇద్దరు పాకిస్తాన్ నేతలు ‘‘అద్భుతమైనవారు’’గా కొనియాడారు. గాజా యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా ప్రతిపాదించిన 20-పాయింట్ల ప్రణాళికకు పాకిస్తాన్ మద్దతు ఇచ్చిందని,వీరిద్దరు పూర్తి మద్దతు ఇస్తోందని ట్రంప్ అన్నారు. Read Also: Odisha: గోడ దూకి ప్రియురాలి ఇంట్లోకి ప్రవేశించిన ప్రియుడు.. విద్యుత్ షాక్…
Pakistan: పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుగ్రహం కోసం తాపత్రయపడుతున్నారు. ఆరేళ్ల తర్వాత, తొలిసారిగా పాకిస్తాన్‌తో అమెరికా ద్వైపాక్షిక చర్చలు నిర్వహించింది. రెండు దేశాల సంబంధాలు బలపడుతున్నాయి. అయితే వీటన్నింటికి ఒకే కారణం కనిపిస్తోంది. పాకిస్తాన్‌లోని అరుదైన ఖనిజాలపై అమెరికా కన్నేసింది. అమెరికా ఆశలకు అనుగుణంగా పాకిస్తాన్ కూడా పనిచేస్తోంది. ముఖ్యంగా, రేర్-ఎర్త్ ఖనిజాలపై అమెరికా దృష్టి సారించిన నేపథ్యంలో, ఇటీవల వైట్ హౌజ్‌లో…
Pakistan: అల్ ఖైదా అధినేత, అమెరికా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను యూఎస్ బలగాలు పాకిస్తాన్‌లోని అబోటాబాద్‌లో హతమార్చాయి. 2001 సెప్టెంబర్ 11 దాడులు జరిగిన దాదాపు 10 ఏళ్ల తర్వాత లాడెన్ జాడను కనిపెట్టి, 2011 మే 2న యూఎస్‌కు చెందిన నేవీ సీల్స్ దాదాపు 40 నిమిషాల పాటు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి, హతం చేశాయి.
అమెరికా అధ్యక్షుడు టెర్రరిజాన్ని వ్యతిరేకించారు.. కానీ పాకిస్తాన్ ను తప్పుబట్టలేదు అని నారాయణ పేర్కొన్నారు. ట్రంప్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నా.. భారత ప్రధాని ఒక్కమాట మాట్లాడడం లేదు.. ట్రంప్ నేనే ఆపాను యుద్ధాన్ని అంటాడు.. మన ప్రధాని నోరు తెరవడు.. ఎందుకంత భయం.. బానిస లాగా ఎందుకు భావించడం అని అడిగారు.
Pakistan: పాకిస్తాన్ అణ్వాయుధాలను అమెరికా టార్గెట్ చేసిందని ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ ఆరోపించారు. 2004 జనవరి 20న పదవీ బాధ్యతలను చేపట్టనున్న అమెరికా అధ్యక్షుడికి డొనాల్డ్ ట్రంప్‌కి రాయబారిగా ఉన్న రిచర్డ్ గ్రెనెల్ పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విడుదల చేయాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) చీఫ్ ఈ సంచలన ఆరోపణలు చేశారు.