USA: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్రమ వలసదారులు, ఇమ్మిగ్రేషన్లపై విరుచుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సరైన డాక్యుమెంట్లు లేని వలసదారులను దేశం నుంచి బహిష్కరించాడు. ఇదిలా ఉంటే, వలసదారుల అణిచివేతలో భాగంగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మరో చర్యను తీసుకుంది.
Donald Trump: డాక్యుమెంట్లు లేకుండా అమెరికాలో ఉంటున్న భారతీయులను తీసుకునేందుకు మన దేశం అంగీకరించింది. అమెరికాలోకి అక్రమంగా వచ్చిన భారతీయ వలసదారుల విషయంలో ప్రధాని నరేంద్రమోడీ ‘‘సరైనది చేస్తారు’’ అని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ప్రధాని మోడీ, ట్రంప్ సోమవారం ఫోన్‌లో మాట్లాడిన తర్వాత ట్రంప్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ఇరువురు నేతలు రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలు, ద్వైపాక్షిక సంబంధాల గురించి, ప్రపంచ రాజకీయ పరిస్థితుల గురించి చర్చించారు.