టెస్లా కార్ల సంస్థకు అమెరికాలో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా షోరూమ్‌కి దుండగులు నిప్పుపెట్టారు. దీంతో ఈ ఘటనలో పలు కార్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. భారీ అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. రంగంలోకి దిగిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేశారు.