Special : హైదరాబాద్… ఇప్పుడు గ్లోబల్ సిటీగా ఎదుగుతోంది. అయితే, నగరంలో ఎటు చూసినా గాలిలో వేలాడుతున్న కేబుల్స్, వైర్ల జంక్షన్లు నగర సౌందర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా విద్యుత్ వైర్లు, ఇంటర్నెట్ కేబుల్స్ మరియు కమ్యూనికేషన్ లైన్ల గందరగోళం నిత్య సమస్యగా మారుతోంది. గాలిలో వేలాడుతున్న ఈ ట్యాంగిల్డ్ వైర్స్ కేవలం నగర అందాన్ని దెబ్బతీయడమే కాదు, యాక్సిడెంట్లకు కూడా కారణం అవుతున్నాయి. ఇక వర్షాకాలంలో ఈ ఓవర్‌హెడ్ లైన్స్ నిర్వహణ అనేది పెద్ద టాస్క్గా మారుతోంది.…
Amaravathi: అమరావతిని గ్రీన్ అండ్ రెసిలియంట్ సిటీగా మలచడం కోసం యోకోహామాతో సిటీ-టు-సిటీ భాగస్వామ్యాన్ని కుదుర్చుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ బృందం యోకోహామా నగరంలో “క్లైమేట్ యాక్షన్, స్మార్ట్ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సిటీ మేనేజ్మెంట్‌లో టెక్నాలజీ వినియోగం, ఆర్థిక అభివృద్ధి” నమూనాలను కూడా అధ్యయనం చేస్తోంది. ఇందులో భాగంగా హోకుబు స్లడ్జ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్ బృందం యోకోహామా సిటీలో ఐదు రోజుల అధ్యయన పర్యటనలో ఉన్నారు.…
HYDRA : హైదరాబాద్ నగరంలోని మధురనగర్ మెట్రో స్టేషన్ సమీపంలోని ఎల్లారెడ్డిగూడలోని సాయి సారధి నగర్‌లో ఉన్న decades-old పార్కు స్థలాన్ని అక్రమంగా ఆక్రమించిన నిర్మాణాలను హైదరాబాద్ డెవలప్‌మెంట్ అథారిటీ (HYDRAA) ఆదివారం కూల్చివేసింది. వీకెండ్ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా ఈ చర్యలు చేపట్టారు. సాయి సారధినగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇచ్చిన ప్రజావాణి ఫిర్యాదు ఆధారంగా, హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు. అధికారులు నిర్వహించిన విచారణలో 1961లో రూపుదిద్దుకున్న 35…
GHMC : హైదరాబాద్ బల్దియా పరిధిలోని టౌన్ ప్లానింగ్ శాఖలో శుభ్రపరిచే చర్యలకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ శ్రీకారం చుట్టారు. అధికారులపై వస్తున్న అవినీతి ఆరోపణలు, కొందరిపై ఏసీబీ వలలో చిక్కిన ఘటనల నేపథ్యంలో శనివారం మొత్తం 27 మంది అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మార్పుల్లో 13 మంది అసిస్టెంట్ సిటీ ప్లానర్లు (ACP), 14 మంది సెక్షన్ ఆఫీసర్లు ఉన్నారు. కొన్ని చోట్ల ప్రమోషన్లు కూడా ఇచ్చారు. పని…
ఉప్పల్ నుంచి ఘట్ కేసర్ వైపు నిర్మిస్తున్న ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించిన భూ సేకరణ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలపై కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి అధికారులను ఆరా తీశారు. ప్రజల ప్రయాణ సౌలభ్యం కోసం ప్రాధాన్యతతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉప్పల్-ఘట్ కేసర్ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం భూమి సేకరణలో ఆలస్యం పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు. లక్షలాది ప్రయాణికుల రాకపోకలకు ఉపయోగపడే…
GHMC Tender: హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేబీఆర్ పార్క్ చుట్టూ పెరుగుతున్న ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు జీహెచ్ఎంసీ భారీ ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ కింద ఏడు స్టీల్ బ్రిడ్జిలు, ఏడు అండర్ పాస్‌లు నిర్మించనున్నారు. మొత్తం రూ.1,090 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులను రెండు ప్యాకేజీలుగా విభజించారు. హెచ్‌సిటి (H-City) ప్రాజెక్టులలో భాగంగా నగరంలోని పలు ప్రధాన రహదారుల్లో ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మాణానికి ప్రభుత్వం…
HYDRA: హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలను గుర్తించి, తొలగించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హైడ్రా (HYDRA) మరోసారి తన దూకుడును ప్రదర్శించింది. హైడ్రా ప్రధానంగా చెరువులు, నదులు, ప్రభుత్వ భూములు, ఫుట్‌పాత్‌లు, రహదారులపై ఏర్పడ్డ అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. నగరంలో ప్రణాళికా ప్రకారంగా అభివృద్ధి జరగాలని, అక్రమ ఆక్రమణలతో చెరువులు, బఫర్ జోన్ ప్రాంతాలు నాశనం కాకుండా ఉండాలని ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. గత కొంత కాలంగా హైడ్రా ఆక్రమణదారులపై ఉక్కుపాదం…
China: చైనాలోని శాంఘైకు పశ్చిమంగా ఉన్న జిన్‌కి పట్టణంలో ఒక వృద్ధుడు హువాంగ్ పింగ్ తన రెండు అంతస్తుల ఇంట్లో జీవిస్తున్నాడు. అయితే, ప్రభుత్వ ప్రతిపాదిత పరిహారం తీసుకోకుండా ఒక రహదారి మధ్యలో తన సొంత ఇంటిలో జీవిస్తున్నాడు. నిజానికి ఆ వృద్ధుడు తనతో పాటు ఉంటున్న 11 నెలల మనవడు నివసిస్తున్న ఇంటి దగ్గర నేషనల్ హైవే నిర్మిస్తున్న కారణంగా దానిని కూల్చడానికి ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇందుకు పరిహారంగా పువాంగుకు ఏకంగా 1.6 మిలియన్ CNY…
HYDRA: హైదరాబాద్ డిసాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRA) నేడు (ఆదివారం) మాదాపూర్‌లో అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టిన 6 అంతస్తుల భారీ భవనాన్ని కూల్చివేసేందుకు సిద్ధమవుతోంది. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో సెట్ బ్యాక్ నిబంధనలు పాటించకుండా నిర్మించబడుతున్న ఈ భవనం అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టడంతో, హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో చర్యలు ప్రారంభమయ్యాయి. స్థానికులు ఈ అక్రమ నిర్మాణంపై పలుమార్లు ఫిర్యాదులు చేయడంతో హైడ్రా అధికారులు రంగంలోకి దిగింది. ఫీల్డ్ విజిట్…