UPI Payments: మీరు యూపీఐ యాప్‌లు ఉపయోగిస్తున్నారా? అయితే ఈ మార్పుల గురించి తప్పక మీరు తెలుసుకోవాల్సిందే. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి యూపీఐలోని పర్సన్-టు-పర్సన్ (P2P) ‘కలెక్ట్ రిక్వెస్ట్’ ఫీచర్‌ను పూర్తిగా తొలగిస్తున్నట్లు ప్రకటించింది.