2025 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఎర్రకోట నుంచి 12వ సారి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, మేడ్ ఇన్ ఇండియా, స్వావలంబన భారతదేశం గురించి నొక్కి చెప్పారు. మిషన్ మోడ్‌లో సెమీకండక్టర్లపై పనిచేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. భారతదేశంలోని ప్రజలు తయారు చేసే మేడ్ ఇన్ ఇండియా సెమీకండక్టర్ చిప్‌లు ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్‌లోకి వస్తాయన్నారు. రాబోయే కాలంలో భారతదేశం సెమీకండక్టర్ల కేంద్రంగా మారుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. 30-40…