Two UP Sisters Found Living With Their Mother’s Dead Body: ఓ ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఏడాది క్రితం మరణించిన తల్లి శవంను ఇంట్లోనే పెట్టుకొని నివసిస్తున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జిల్లాలో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇరుగుపొరుగు వారికి అక్కాచెల్లెళ్లు కొన్ని రోజులుగా కనిపించకపోవడం, తలుపులు మూసి ఉండడం కారణంగా అనుమానం రావడంతో అసలు విషయం బయటికి వచ్చింది. అక్కాచెల్లెళ్ల మానసిక పరిస్థితి సరిగా లేదని దర్యాప్తులో తేలింది. వివరాల ప్రకారం… మదర్వా…
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ప్రపోజ్ చేస్తే ఒప్పుకోలేదని మహిళను ఓ వ్యక్తి గొడ్డలితో నరికి హత్య చేశాడు. కాన్పూర్‌లోని రాణా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. 26 ఏళ్ల వ్యక్తి తన పొరుగును ఉండే మహిళను నరికి చంపి, ఆ తర్వాత విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు.
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. మహ్మద్ ప్రవక్తను అవమానించడనే ఆరోపణలో ఓ వ్యక్తి బస్సు కండక్టర్‌పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. పదునైన ఆయుధంతో పొడిచాడు. ప్రస్తుతం కండక్టర్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన ప్రయాగ్‌రాజ్‌లో జరిగింది. 20 ఏళ్ల యువకుడికి, కండక్టర్‌కి బస్సు టికెట్ ఛార్జీపై వివాదం మొదలైంది. ఆ తర్వాత అతనిని పొడిచాడు. ప్రవక్త గురించి అవమానకరంగా మాట్లాడినందుకే కండక్టర్‌పై దాడి చేసినట్లు నిందితుడు ఓ వీడియోలో…
A Young Man Carries Cobra to the hospital in UP: డాక్టర్ ఇదే నాగుపాము నన్ను కాటేసింది.. త్వరగా ఇంజెక్షన్ చేయండి అంటూ ఓ యువకుడు ఆసుపత్రికి వచ్చాడు. దాదాపు 4-5 అడుగుల నాగుపామును చూసిన డాక్టర్లు, అక్కడున్న పేషేంట్స్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కొందరు అయితే భయంతో ఆసుపత్రి బయటకు పరుగులు తీశారు. డాక్టర్ చివరకు యాంటీవీనమ్ ఇంజెక్షన్‌ను యువకుడికి ఇచ్చాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీర్జాపుర్‌లో సోమవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం……
Uttar Pradesh: కొందరు మహిళలు చేస్తున్న నేరాలను చూస్తుంటే, ఆశ్చర్యం, అసహ్యం కలగకుండా ఉండటం లేదు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్‌లో జరిగిన ఓ మహిళ పెళ్లి చేసుకున్న భర్తనే బ్లాక్మెయిల్ చేస్తుంది. తమకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు బయటపెడతానని, డబ్బులు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేసింది. సదరు వ్యక్తి పోలీస్ అయినప్పటికీ.. ఆమె ఎక్కడా వెనక్కి తగ్గకుండా డబ్బులను డిమాండ్ చేసింది.
Halal: ఉత్తర్ ప్రదేశ్ లో యోగి సర్కార్ నకిలీగాళ్లపై ఉక్కుపాదం మోపుతోంది. నకిలీ హలాల్ ధృవపత్రాలను ఉపయోగించి ఉత్పత్తులను విక్రయించే అనేక మంది వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. హలాల్ సర్టిఫికేట్ ఇస్లామిక్ చట్టానికి అనుగుణంగా ఉత్పత్తులు తయారుచేయబడ్డాయని, కల్తీ లేదని సూచించిస్తుంది.
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జంక్షన్లో రైలు అగ్ని ప్రమాదానికి గురైంది. బీహార్ వెళ్తున్న దిబ్రూగఢ్-లాల్‌ఘర్ ఎక్స్‌ప్రెస్‌లోని జనరల్ కోచ్‌లో మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు చీఫ్ ఫైర్ ఆఫీసర్ (CFO) చంద్ర మోహన్ శర్మ తెలిపారు.
Gambling: సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తించాడు ఓ భర్త. భార్యభర్తల బంధాన్ని అపహాస్యం చేసేలా ప్రవర్తించాడు. భార్యను జూదంలో పణంగా పెట్టి ఓడిపోయాడు. తన భార్యను ఏం తెలియని నగరంలో వదిలేసి వచ్చాడు. ఈ ఘటన యూపీలో అమ్రోహాలో జరిగింది. అయితే విషయం తెలుసుకున్న మహిళ సోదరుడు ఆమెను రక్షించి ఇంటికి తీసుకొచ్చాడు.
అర్హులైన కుటుంబాలకు వారి కుమార్తెల పెళ్లిళ్లకు ప్రభుత్వం 'ముఖ్యమంత్రి సామూహిక వివాహ యోజన' కింద రూ.51,000 ఇస్తోందని తెలిపారు. మహిళల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎవరైనా వేధింపులకు పాల్పడితే రావణుడు, కంసుడి గతి పడుతుందని, తీవ్ర పరిణామాలు చవిచూస్తారని అన్నారు.
Uttar Pradesh: గత కొంత కాలంగా డ్రగ్స్ మాఫియా పైన ద్రుష్టి సారించారు నోయిడా పోలీసులు. ఈ నేపథ్యంలో నోయిడాలో పోలీసులు ఈ రోజు ఉదయం చేసిన దాడుల్లో డ్రగ్స్ విక్రయిస్తున్న 5 మంది పట్టుబడ్డారు. ఈ క్రమంలో రాహుల్ అనే స్నేక్చామర్ దగ్గర 20 ఎంఎల్ విషాన్ని పోలీసులు కనుగొన్నారు. కాగా కనుగొన్న ఆ విషాన్ని విచారణ కోసం ఎఫ్ఎస్ఎల్కు పంపారు. అయితే ఈ కేసులో నిందితలను విచారించగా పలువురు వ్యక్తులు నిందితుల దగ్గర నుండి…