ఆమె హీరోయిన్ కాదు. ఒక సామాన్య ఉద్యోగి. కానీ ఆమెను చూసినవారంతా కళ్లు తిప్పుకోలేకపోతున్నారు. అందుకు ఆమె అందమే కారణం. ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించేందుకు వచ్చి ఇప్పుడు బిగ్ సెలబ్రిటీగా మారిపోయింది. ఇంతకీ ఆమె ఎవరు? ఆమె ఏం చేస్తుంది. సోషల్ మీడియాలో ఇంతగా ట్రెండింగ్ అవ్వడానికి ఆమె ఏం చేసింది. ఈ విషయాలు తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.

దేశ వ్యాప్తంగా శుక్రవారం ఎన్నికల పండుగ ప్రారంభమైంది. మొత్తం 102 పార్లమెంట్ స్థానాల్లో పోలింగ్ ముగిసింది. ఓ వైపు ఎండలు దంచికొడుతున్న ఓటర్లు.. ఓటు వేసేందుకు పోలింగ్ బూత్‌లకు క్యూ కట్టారు. అయితే ఓ పోలింగ్ బూత్‌లో ఏజెంట్‌గా పని చేస్తున్న ఉద్యోగి మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సినీ తారలా మెరిసిపోతున్న ఆమె ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈశా అరోరా. ఓ పోలింగ్ బూత్‌లో ఏజెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించింది. పోలింగ్ బూత్ దగ్గరకు వస్తున్నప్పుడు ఆమె దృశ్యాలను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అంతే క్షణాల్లో ఆమె సెలబ్రిటీగా మారిపోయింది.
ఇది కూడా చదవండి: Vasuki Indicus: టైటానోబోవా కన్నా పెద్ద పాము ఈ “వాసుకి”.. కచ్‌లో బయటపడిన అతిపెద్ద పాము శిలాజాలు..
ఉత్తరప్రదేశ్‌లోని సహరణ్‌పుర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని గంగోహ్ ప్రాంతంలో ఈశా అరోరా ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. పోలింగ్‌కు ముందు రోజు ఆమె ఈవీఎం బాక్సులు తీసుకుని పోలింగ్ కేంద్రానికి వచ్చింది. ఆ సందర్భంగా తీసిన దృశ్యాలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఆమెను చూసిన వారంతా హీరోయిన్ లేక ఉద్యోగినో తెలియక కన్‌ఫ్యూజ్ అయ్యారు. ఎందుకంటే ఆమె అంత అందంగా ఉండడమే కారణం. ఆమె పోలింగ్ కేంద్రానికి ఈవీఎంలు తీసుకున్న దృశ్యాలను కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అంతే ఆమె ఎవరు? అంటూ నెట్టింట తెగ సెర్చింగ్ చేసేస్తున్నారు. ఈశా అరోరా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగిని. గతంలో రెండుసార్లు ఎన్నికల విధులు నిర్వర్తించారు. తాజాగా మరోసారి ఎన్నికల విధులు నిర్వహించారు.
ఇది కూడా చదవండి: KGF 3: కేజీఎఫ్-3 ఇక్కడే .. కొత్త అర్థం చెప్పిన చంద్రబాబు!
ఆమెకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఒక జాతీయ మీడియా ఆమెను పలకరించింది. అయితే తాను ఆ వీడియోలు చూడలేదని.. సమయం దొరకలేదని చెప్పారు. ఇక విధుల్లో ప్రతి ఒక్కరికీ క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరి అని చెప్పారు. అది ఉంటేనే ఏ రంగంలోనైనా రాణించగలమని పేర్కొన్నారు. దీన్ని పాటించడం వల్లే ఎన్నికల విధుల్లోనూ ఎలాంటి ఇబ్బందులు ఎదురవలేదని ఆమె చెప్పుకొచ్చారు.