ఇటీవల కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన టాక్ షోలలో నందమూరి బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’ కూడా ఒకటి. ఇది హీరోలతో పాటు చిత్రనిర్మాతలకు ఇష్టమైన స్టాప్‌గా మారింది. ‘పుష్ప’ టీమ్ ఇప్పటికే విడుదలకు ముందు చిత్రాన్ని ప్రమోట్ చేసింది. అయితే ఇప్పుడు చిత్ర బృందం బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’ షోలో కన్పించబోతోందని సమాచారం. తదుపరి ఎపిసోడ్ కోసం ఈ టాక్ షోలో అల్లు అర్జున్, రష్మిక, దర్శకుడు సుకుమార్ బాలయ్యతో కలిసి పాల్గొననున్నారు. వాస్తవానికి ‘అన్‌స్టాపబుల్’ నెక్స్ట్ ఎపిసోడ్‌లో రవితేజ,…
ఇది కదా మనకి కావాల్సిన మాస్… తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బాలయ్యతో రవితేజ పిక్ చూసి మాస్ ప్రేక్షకులు అనుకుంటున్న మాట. నందమూరి బాలకృష్ణ “అన్‌స్టాపబుల్” షో ఆహాలో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. ఈ షోకి టాప్ క్లాస్ రెస్పాన్స్ వచ్చింది. బాలకృష్ణ హోస్టింగ్ నైపుణ్యానికి అభిమానులు, ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుతున్నాయి. ఎస్ఎస్ రాజమౌళి పాల్గొన్న తాజాగా షోకు సంబంధించిన ఎపిసోడ్ ఈ రోజు ప్రసారం అవుతోంది. బాలకృష్ణ, రాజమౌళి మధ్య…
‘ఆహా’ సెలబ్రిటీ చాట్ షో “అన్‌స్టాపబుల్”తో ఓటిటి ఎంట్రీ ఇచ్చిన నందమూరి బాలకృష్ణకు తాజా ఎపిసోడ్ లో నాని సర్ప్రైజ్ ఇచ్చారు. ఆ సర్ప్రైజ్ తో బాలయ్య పదేళ్లు వెనక్కి వెళ్లారు. “అన్‌స్టాపబుల్” మొదటి రెండు ఎపిసోడ్‌లకు మంచి స్పందన లభించింది. మంచు కుటుంబం తర్వాత ఈ కార్యక్రమానికి హాజరైన నేచురల్ స్టార్ నాని బాలయ్యతో స్నేహపూర్వకంగా మాట్లాడాడు. షో మధ్యలోనాని బాలకృష్ణకు ఒక చిన్న అమ్మాయిని పరిచయం చేసి ఆశ్చర్యపరిచాడు. మొదట్లో బాలయ్య ఆ అమ్మాయిని…
టాలీవుడ్ హీరోల్లో బాలకృష్ణ మనసు ఎంతో మంచిదని చాలా మంది చెప్తుంటారు. ఆయనకు కోపం ఉన్నా సరే… సేవాగుణంలో మాత్రం ఆణిముత్యం అని పేరు ఉంది. ఇటీవల ‘ఆహా’ ఓటీటీలో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే అంటూ ఓ షోను బాలయ్య చేస్తున్నాడు. ఆ షో ఫస్ట్ ఎపిసోడ్‌లో అజీజ్ అనే కుర్రాడి గురించి బాలయ్య ఓ వీడియో చూపించాడు. అజీజ్ తన సోదరి బేగం బ్రెయిన్ క్యాన్సర్ ట్రీట్‌మెంట్ కోసం చదువుమానేసి పనిచేస్తున్నాడని ఆ వీడియో ద్వారా…
స్టార్ హీరోలు డిజిటల్ ఎంట్రీ కత్తిమీద సాము లాంటిది. ఏమాత్రం అటూ ఇటూ అయినా సోషల్ మీడియా తెగ మోసేస్తుంది. ఈ విషయంలో బాక్సాఫీస్ బొనంజా బాలకృష్ణ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినట్లే. అసలు మెగా ముద్ర పడిన ‘ఆహా’ ఓటీటీకి షో చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే బాలయ్య గట్స్ కి నిదర్శనం. ఈ తరహా షో తో ‘ఆహా’పై పడ్డ మెగా ముద్ర నెమ్మది నెమ్మదిగా పోతుందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ…
నందమూరి బాలకృష్ణ సినిమాల్లో ఆయన పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో విలన్ లకు కూడా అంతే ప్రత్యేకత ఉంటుంది. “లెజెండ్” సినిమాతో జగపతి బాబు కెరీర్ ఎలా టర్న్ తీసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే బాలయ్య కోసం మరో సీనియర్ హీరో మోహన్ బాబు కూడా విలన్ గా మారడానికి రెడీ అయిపోయారు. Read also : బిగ్ బాస్ 5 : డేంజర్ జోన్ లో ఆ ముగ్గురూ ? బాలయ్య అభిమానులు…
వన్స్ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్ అంటూ బాలయ్య ఓ సినిమాలు చెప్పిన డైలాగ్‌కు అనువధించినట్లుగానే ప్రస్తుతం యూట్యూబ్‌లో పరిస్థితి నెలకొంది. అదేంటీ అనుకుంటున్నారా.. అవునండీ.. ఓటీటీలో దూసుకుపోతున్న ఆహాలో నందమూరి బాలకృష్ణ (ఎన్‌బీకే) హోస్ట్‌గా అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే షో నిర్వహించారు. ఈ షోకు సంబంధించిన ప్రొమోను ఇటీవల యూట్యూబ్‌లో ఆహా విడుదల చేసింది. దీంతో టీవీల్లో ఇంటర్య్వూలకే ఆసక్తి కనబరచని బాలయ్య ఏకంగా హోస్ట్ చేస్తున్నారా..? ఎలా ఉందో చూడాలి మరీ..? అంటూనే చూసేస్తున్నారు.…
పాపులర్ తెలుగు ఓటిటి సంస్థ ‘ఆహా’ జెట్ స్పీడ్ తో సరికొత్త షోలతో దూసుకెళ్తోంది. ‘ఆహా’కు, అందులో ప్రసారమవుతున్న షోలకు వస్తున్న రెస్పాన్స్ చూసి దిగ్గజ ఓటిటి సంస్థలు సైతం షాకవుతున్నాయని ఇటీవలే స్టార్ ప్రొడ్యూసర్ ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే’ షో లాంచ్ చేసిన వేదికపై తెలిపారు. తెలుగు ప్రేక్షకులను మరింతగా ఎంటర్టైన్ చేయడానికి పలు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది ‘ఆహా’. ఇప్పటికే ‘సామ్ జామ్’ అంటూ సమంతను హోస్టుగా మార్చి పలువురు సెలెబ్రటీలతో షో…
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ విడుదలకు సిద్ధమవుతోంది. బోయపాటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉండగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన నెక్స్ట్ మూవీ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన హోస్ట్ గా చేయడానికి రెడీ అయ్యారు. పాపులర్ తెలుగు ఓటిటి ‘ఆహా’లో ఓ టాక్ షోను చేయబోతున్నారన్న విషయం తెలిసిందే. ఈ షోకు “అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే” అనే టైటిల్ ను…
ఓవర్ ద టాప్ ఫ్లాట్ ఫామ్ లోకి మెల్లగా టాప్ స్టార్స్ కూడా అడుగు పెడుతున్నారు. మాస్ లో విశేషమైన ఫాలోయింగ్ ఉన్న నటసింహం నందమూరి బాలకృష్ణ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో అడుగు పెట్టడం విశేషమనే చెప్పాలి. ఇక ఆ ఫ్లాట్ ఫామ్ బాలయ్య బాక్సాఫీస్ పోటీదారుడైన చిరంజీవి మెగా ఫ్యామిలీకి చెందిన వారిది కావడం మరింత విశేషం. బాలయ్య నిర్వహించే ‘అన్ స్టాపబుల్’ టాక్ షో చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ భాగస్వామిగా ఉన్న…