ఇది కదా మనకి కావాల్సిన మాస్… తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బాలయ్యతో రవితేజ పిక్ చూసి మాస్ ప్రేక్షకులు అనుకుంటున్న మాట. నందమూరి బాలకృష్ణ “అన్‌స్టాపబుల్” షో ఆహాలో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. ఈ షోకి టాప్ క్లాస్ రెస్పాన్స్ వచ్చింది. బాలకృష్ణ హోస్టింగ్ నైపుణ్యానికి అభిమానులు, ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుతున్నాయి. ఎస్ఎస్ రాజమౌళి పాల్గొన్న తాజాగా షోకు సంబంధించిన ఎపిసోడ్ ఈ రోజు ప్రసారం అవుతోంది. బాలకృష్ణ, రాజమౌళి మధ్య సాగే సంభాషణక ఆకట్టుకుంటోంది.
Read Also : మాట నిలబెట్టుకున్న రామ్… 4 నెలల్లోనే ఇలా..!
తదుపరి ఎపిసోడ్ షూటింగ్ ఈరోజు ప్రత్యేక సెట్ లో జరుగుతోంది. నెక్స్ట్ ఎపిసోడ్‌కు మాస్ మహారాజ్ రవితేజ అతిథిగా వస్తున్నారు. బాలకృష్ణ, రవితేజల మధ్య విభేదాలు ఉన్నాయని గత కొన్నేళ్లుగా చాలా ఊహాగానాలు ఉన్నాయి. అయితే ఆ ఊహాగానాలకు తెరదించుతూ బాలకృష్ణ రవితేజకు హోస్ట్‌గా వ్యవహరించారు. ‘ఆహా’లో వీరిద్దరి అన్‌స్టాపబుల్ ఫన్ చూడాలంటే మరో వారం ఆగాల్సిందే. ఇక ఈ ఎపిసోడ్ లో బాలకృష్ణ నెక్స్ట్ మూవీ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కూడా పాల్గొనబోతున్నారు. ఈ ఎపిసోడ్ డిసెంబర్ 24న ప్రసారం కానుంది. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ కు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.