నకిలీ సర్టిఫికెట్ లను అరికట్టేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో రేపు అన్ని యూనివర్సిటీ వీసీలతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి డీజీపీ మహేందర్ రెడ్డి హాజరు కానున్నారు. వెబ్‌సైట్‌లో స్టూడెంట్ అకడమిక్ రికార్డ్స్ వేరిఫికేషన్ సర్వీసెస్ ను ఉన్నత విద్యామండలి అందుబాటులోకి తీసుకురానుంది. స్టూడెంట్ అకడమిక్ రికార్డ్స్ వేరిఫికేషన్ సర్వీసెస్ ద్వారా, నకిలీ సర్టిఫికెట్ దందా ను అరికట్టడం, ఉద్యోగాలు ఇచ్చే సంస్థలకు సర్టిఫికెట్స్ వేరిఫికేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించడం జరుగుతుందని అధికారులు…
తెలంగాణ రాష్ర్టంలోని అన్ని యూనివర్సిటీల వీసీలతో ఉన్నత విద్యామండలి సమావేశమైంది. 11 యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుల భర్తీపై చర్చిస్తున్నారు. వర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయడం కోసం విధివిధానాలు రూపొందించనున్నారు. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ప్రణాళిక రూపొందించనున్నారు. ఫ్యాకల్టీ నియామకం స్టేట్ వైడ్ గా (కేంద్రీకృతంగా) అన్ని యూనివర్సిటీ లకు కలిపి, లేదా యూనివర్సిటీ వైస్ గా చేయాలా అనే దానిపై వీసీల అభిప్రాయం తీసుకుంది…