సెప్టెంబర్ నుంచి అమరావతి పనులు క్లియర్ గా కనిపిస్తాయన్నారు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్.. 40 నుంచి 50 వేల కోట్ల రూపాయల పనులు త్వరలో జరగబోతున్నాయన్నారు.. గత 5 ఏళ్లలో వ్యవస్థలన్నీ సర్వనాశనం చేశారన్న ఆయన.. రెండు మూడు సంవత్సరాల్లో మంచి నగరాన్ని చూస్తారని తెలిపారు.. చిన్న సమస్యలను ఉంటే వాటిని మేం పరిష్కరిస్తాం.. ఏ రాష్టానికి లేని సంస్థలు, ఉద్యోగాలు ఏపీకి మూడు, నాలుగు సంవత్సరాల్లో రాబోతున్నాయి..
ఆదివాసి సంక్షేమమే కూటమి లక్ష్యం అన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్... అల్లూరి సీతారామరాజు, ఏకలవ్యుడు, వెన్నెలకంటి రాఘవయ్య వంటి మహాపురుషుల సేవలను గుర్తించాలన్నారు.. సీఎం చంద్రబాబు సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి ఆదివాసీలకు గుర్తింపు తెచ్చారని ప్రశంసలు కురిపించారు..
గుంటూరులో శంకర్ విలాస్ బ్రిడ్జి స్థానంలో కొత్తగా ఆర్‌వోబీ నిర్మాణం వీలైనంత తక్కువ సమయంలో పూర్తి చేస్తామన్నారు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఆర్‌వోబీ నిర్మాణంతో భూములు కోల్పోయే 21 మందికి 70 లక్షల చెక్కులు పంపిణీ చేశారు. ఆర్‌వోబీపై ప్రజల్లో అపోహలు సృష్టించవద్దన్నారు. మొదట ఆర్‌యూబీ నిర్మాణం చేసి తర్వాత ఆర్వోబీ నిర్మాణం చెయ్యడం కుదరదని చెప్పారు. అండర్ పాసులు, సర్వీస్ రోడ్లు ఉండేలా నిర్మాణం చేస్తామని స్పష్టం చేశారు పెమ్మసాని చంద్రశేఖర్..
మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు హాట్ కామెంట్స్ చేశారు.. వైసీపీ కార్పొరేటర్లను తాము కొనడం లేదని చెబుతున్న కేంద్రమంత్రి.. దేవుడి మీద ప్రమాణం చేసి ఆ మాటలు చెప్పాలని సవాల్ విసిరారు.. కేంద్ర మంత్రి చెప్పే, పిట్టకథలు, పిల్ల కథలు గుంటూరు ప్రజలకు చెబితే నమ్మరని, టీడీపీ నేతలకు దిమాక్ ఎంత ఉందో త్వరలోనే చూస్తామన్నారు.