నేడు కామారెడ్డి జిల్లాలో రెండో రోజు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటిస్తున్నారు. ఇవాళ బాన్సువాడ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన కొనసాగుతుంది. బిక్నూర్ లో రేషన్ షాపును నిర్మలా సీతారామన్ సందర్శించారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ పై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. బీర్కూర్ లో రేషన్ షాప్ తనిఖీ చేసిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేదలకు ఇచ్చే రేషన్ బియ్యంలో కేంద్రం వాటా,…
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఎంపీ విజయ సాయి రెడ్డి మాట్లాడుతూ.. బడ్జెట్…సబ్‌కా సాథ్ కాదు సబ్‌కా హాత్ అని ఆయన ఎద్దేవా చేశారు. కేంద్ర బడ్జెట్‌ను దుయ్యబట్టిన విజయసాయి రెడ్డి.. కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం జరిగిందని అన్నారు. ఈ బడ్జెట్ ఆపరేషన్ సక్సెస్… కానీ పేషెంట్ డెడ్ అంటూ కేంద్రానికి చురకలు అంటించారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్ బడ్జెట్ అవుతుందేమోనని ఊహించామని, బడ్జెట్ ప్రసంగం విన్న తర్వాత ఇది ఏ రాష్ట్రానికి…
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. కరోనా సంక్షోభానికి ప్రభావితమైన వివిధ రంగాలను ఆదుకునేందుకు ప్రధాన మంత్రి 20 లక్షల కోట్లతో ఆత్మ నిర్భర్ భారత్ పేరిట సహాయ ప్యాకేజీ ప్రకటించి ఇప్పటికీ ఒక సంవత్సరం పైగా కావస్తున్నదని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ తయారీ రంగానికి వెన్నుముకగా నిలుస్తున్న సూక్ష్మ మరియు మధ్యతరహా పరిశ్రమలకు ఈ ప్యాకేజీ ద్వారా లబ్ధి చేకూర్చేలా తాను పరిశ్రమల శాఖ మంత్రిగా గట్టి ప్రయత్నం చేస్తూ…