నేడు కామారెడ్డి జిల్లాలో రెండో రోజు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటిస్తున్నారు. ఇవాళ బాన్సువాడ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన కొనసాగుతుంది. బిక్నూర్ లో రేషన్ షాపును నిర్మలా సీతారామన్ సందర్శించారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ పై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. బీర్కూర్ లో రేషన్ షాప్ తనిఖీ చేసిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేదలకు ఇచ్చే రేషన్ బియ్యంలో కేంద్రం వాటా, రాష్ట్ర వాటా ఎంత అని కలెక్టర్ ని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. తనకి తెలియదని కలెక్టర్ సమాధానమిచ్చారు. మీరు IAS ఆఫీసర్ అయ్యి మీకు ఎలా తెలియదు అని నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు. అరగంట టైమ్ ఇస్తాను తెలుసుకొని చేప్పమని కలెక్టర్‌కు మంత్రి చెప్పారు. ఇక కోటగిరి PHC లో వ్యాక్సినేషన్ సెంటర్ ని సందర్శించనున్నారు. మోడీ ఫ్లెక్సీ రేషన్ షాపు దగ్గర ఈ రోజు సాయంత్రం వరకు పెట్టకపోతే తనే వచ్చి ఫ్లెక్సీ కడుతాఅన్నారు. ఫ్లెక్సీలు మా వాళ్ళు కడితే మా వాళ్లపై గంతులేస్తారు. మా ఫ్లెక్సీలు చింపేస్తారు అంటూ మండిపడ్డారు.
నిన్న నిర్మలా సీతారామన్ తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్న ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు రూ. 38,500 కోట్లతో ప్రారంభమై అదనంగా లక్షా 25 వేల కోట్లకు పెంచారని విమర్శించారు. తెలంగాణ అప్పుల గురించి అడగటానికి కేంద్ర ప్రభుత్వానికి హక్కు ఉందని స్పష్టం చేశారు. తెలంగాణలో అప్పుడే పుట్టిన భాబు కూడా లక్ష రూపాయల అప్పు కట్టాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
నేను తెలంగాణ ప్రజల కోసం నమస్కరిస్తున్నానని.. కేంద్ర ప్రభుత్వం పథకాలు ప్రతీ ఒక్కటీ అమల్లోకి రావాలని అని అన్నారు. అప్పులపై ఓపికగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వానికి ఉందని అన్నారు. నేనే కేంద్ర మంత్రి అన్నట్లుగా సీఎం కేసీఆర్ దేశమంతా తిరుగుతున్నారని.. లాభాల్లో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేశారని విమర్శించారు. ఉపాధి హామీ పథకం కింద రూ. 20 వేల కోట్లు ఇచ్చాము.. ఉపాధి హామీ పథకం సర్వే కోసం అధికారులు వచ్చారు.. మేము పంపిన డబ్బులు ఖర్చు చేయకపోతే అధికారులు విచారణ చేస్తారని ఆమె అన్నారు.
MLA Slapped by Her Husband: ఎమ్మెల్యేను చాచిపెట్టి కొట్టిన భర్త.. వీడియో వైరల్