ఇప్పటికే కరోనా డెల్టా వేరియంట్‌లతో అతలాకుతలమవుతున్న ప్రపంచ దేశాలు.. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఒమిక్రాన్‌ను అడ్డుకునేందుకు ఇప్పటికే వివిధ దేశాలు విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. అంతేకాకుండా ఒమిక్రాన్‌పై దృష్టి సారించి ముందస్తు చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో కూడా తాజాగా రెండు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు కావడంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఒమిక్రాన్ సోకిన ఇద్దరు కర్ణాటకలోని బెంగూళూరు ఎయిర్‌పోర్టులో నవంబర్ 11న ఒకరు,…