024 లోక్‌సభ ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి కేబినేట్ భేటీతో పాటు ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ మొదటి సమావేశం నేడు సాయంత్రం 5 గంటలకు దేశ రాజధానిలో జరగనుంది. ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ప్రధాన ఆర్థిక విధానాలు, కార్యక్రమాలను ప్రస్తావించి, వచ్చే నెలలో ప్రభుత్వం యొక్క పూర్తి బడ్జెట్ 2024-25 ప్రకటనకు వేదికను ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
నేడు ఢిల్లీలో కేంద్ర మంత్రి వర్గ భేటీ జరగనుంది. ఈ సమావేశం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరగబోతుంది. అయితే గత ఎన్నికల కంటే తక్కువ స్థానాలు రావడంతో ఈ మంత్రివర్గ సమావేశానికి అధిక ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి మంత్రులతో పాటు సహాయ మంత్రులను కూడా ఆహ్వానించారు.